Deepika Padukone : తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ కుమార్, టాప్ చలన చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఆధ్వర్యంలో రూ. 800 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కనుంది హాలీవుడ్ రేంజ్ లో బన్నీ మూవీ. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి టైటిల్ ను కూడా ఖరారు చేశారు. ఓ వీడియోను కూడా రిలీజ్ చేశారు. పుష్ప 2 తర్వాత దేశ వ్యాప్తంగా ఐకాన్ స్టార్ పేరు మారు మ్రోగి పోయింది. దీనిని ఇంటర్నేషనల్ లెవల్లో హాలీవుడ్ సినిమాలను తలదన్నేలా మూవీ ఉండబోతోందని ఇప్పటికే ప్రకటించాడు దర్శకుడు. ఎంత ఖర్చుకైనా వెనుకాడే ప్రసక్తి లేదంటూ తెలిపాడు సన్ పిక్చర్స్ చీఫ్ , ఎంపీ దయానిధి మారన్.
Deepika Padukone, Janhvi Kapoor in Atlee Movie
ఇక ఏఏ22ఎక్స్ ఏ6 టైటిల్ ను ఖరారు చేసిన దర్శకుడు అట్లీ ఇప్పుడు షూటింగ్ మొదలు పెట్టే పనిలో ఉన్నాడు. ఈసినిమాకు సంబంధించి రోజుకో అప్ డేట్ వస్తోంది. టాప్ హీరోయిన్లను ఇప్పటికే సంప్రదించాడని, ఇందులో బన్నీ ద్విపాత్రాభినయం చేయనున్నాడని, అందుకే ముగ్గురు హీరోయిన్లు ఉండవచ్చని అంచనా. తాజాగా అందిన సమాచారం మేరకు బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు దీపికా పదుకొనే(Deepika Padukone), జాన్వీ కపూర్ లతో చర్చించాడని, అందుకు వారు కూడా ఓకే చెప్పినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయం గురించి ఇంకా క్లారిటీ ఇవ్వలేదు అట్లీ.
ఈ ఇద్దరి నటీమణులతో పాటు మరో హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కూడా ఇందులో నటించే ఛాన్స్ ఉందని టాక్. దీపికా పదుకొనే ఫుల్ బిజీగా ఉంది. తను అట్లీ దర్శకత్వంలో షారుక్ ఖాన్ చిత్రంలో నటించింది. ఇక జాన్వీ కపూర్(Janhvi Kapoor) ప్రస్తుతం రామ్ చరణ్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో పెద్ది మూవీలో కీ రోల్ పోషించనుంది. అంతే కాకుండా జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి దేవర 2లో కీ రోల్ పోషించనుంది. మరో వైపు తమిళ సినీ దర్శకుడు పా రంజిత్ దర్శకత్వం వహిస్తున్న తమిళ వెబ్ సీరీస్ లో కూడా ఎంపికైనట్లు సమాచారం.
Also Read : Hero Akhil Movie : లెనిన్ యాక్షన్ సీన్స్ లో అఖిల్ బిజీ