బాలీవుడ్ నటి దీపికా పదుకొనే గురించి ఎంత చెప్పినా తక్కువే. మోస్ట్ బ్యూటిఫుల్ నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ ఏడాది ఆమెకు సంతోషకరంగా మారింది. బాద్ షా షారుక్ ఖాన్ తో కలిసి నటించిన రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి.
ఇందులో పఠాన్ రూ. 1,000 కోట్లు వసూలు చేసింది. ఇక అట్లీ కుమార్ తీసిన జవాన్ మూవీ రూ. 650 కోట్లను దాటేసింది. ఇంకా ఆ చిత్రం కొనసాగుతోంది. ఇటు ఇండియాలో అటు ఓవర్సీస్ లో దుమ్ము రేపుతోంది.
తాజాగా నటి దీపికా పదుకొనే తన మనసులోని మాటలను బయట పెట్టింది. తాను సోషల్ మీడియాను పట్టించుకోనని తెలిపింది. తనను విమర్శించే వాళ్లను చూసి నవ్వుకుంటానని స్పష్టం చేసింది.
ఎందుకంటే వారి గురించి ఆలోచించే టైం తన వద్ద లేదని పేర్కొంది. తాను అంతర్ముఖురాలినని చెప్పింది. ఎవరితోనూ ఎక్కువగా కలిసి ఉండేందుకు ఇష్టం ఉండదని తెలిపింది దీపికా పదుకొనే.
సినిమాలు, పాత్రలు తనకు నచ్చితేనే ఎంచుకుంటానని లేక పోతే నిర్దాక్షిణ్యంగా నో చెపుతానంటూ తెలిపింది . విచిత్రం ఏమిటంటే తన తండ్రి ప్రముఖ భారతీయ బ్యాడ్మింటన్ ప్లేయర్ ప్రకాష్ పదుకొనే. తను సినిమాను మైదానం లాగా భావిస్తానని, గెలుపు ఓటముల గురించి పట్టించు కోనని స్పష్టం చేసింది దీపికా పదుకొనే.
