Megastar – Beauty Deepika :మెగా మూవీలో దీపికా ప‌దుకొనే..?

జోరుగా టాలీవుడ్ లోప్ర‌చారం

Deepika : వ‌య‌సు మీద ప‌డుతున్నా ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు మెగాస్టార్ చిరంజీవి. త‌ను కొత్త ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాడు. ఇప్ప‌టికే తాను న‌టించిన విశ్వంభ‌ర దాదాపు పూర్తి కావ‌చ్చింది. ఈ చిత్రంపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. మెగా ఫ్యాన్స్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఉత్కంఠ‌తో ఎదురు చూస్తున్నారు. ఇదే స‌మ‌యంలో త‌ను 2023లో చివ‌రిసారిగా భోళా శంక‌ర్ విడుద‌లైంది. కొంత గ్యాప్ వ‌చ్చింది. అయితే విశ్వంబ‌ర‌కు సంబంధించి కొంత అసంతృప్తితో మెగాస్టార్ ఉన్న‌ట్లు టాక్. గ్రాఫిక్స్ స‌రిగా రాలేద‌ని, దీనిపై వ‌శిష్ట ఫుల్ ఫోక‌స్ పెట్టాడు.

Deepika Padukone in Megastar Chiranjeevi Movie

ఈ త‌రుణంలో కీల‌క ప్ర‌క‌ట‌న చేశాడు ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి. త‌ను విక్ట‌రీ వెంకటేశ్, ఐశ్వ‌ర్య రాజేష్, మీనాక్షి చౌద‌రితో తీసిన సంక్రాంతికి వ‌స్తున్నాం మూవీ సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. భారీ ఎత్తున వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ఏకంగా రూ. 300 కోట్ల‌కు పైగా వ‌సూలు సాధించి సినీ వ‌ర్గాల‌ను, విమ‌ర్శ‌కుల‌ను ఆశ్చ‌ర్య ప‌రిచింది. ఈ త‌రుణంలో త‌ను మెగాస్టార్ తో సినిమా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. స్క్రిప్ట్ కూడా పూర్త‌యింది. షూటింగ్ ను త్వ‌ర‌లోనే ప్రారంభిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించాడు అనిల్ రావిపూడి.

మెగాస్టార్ చిరంజీవి కొత్త ప్రాజెక్టుపై దృష్టి సారించాడు. త‌న‌కు జోడిగా ఎవ‌రు న‌టిస్తార‌నే దానిపై చ‌ర్చ‌లు జ‌రుపుతున్నాడు డైరెక్ట‌ర్. రోజుకో వార్త వ‌స్తోంది. మొద‌ట‌గా త‌మిళ సినీ న‌టి న‌య‌న్ తార పేరు వినిపించింది. ఆ త‌ర్వాత త్రిష కృష్ణ‌న్ ఇప్పుడు ఇంకో వార్త హ‌ల్ చ‌ల్ చేస్తోంది. బాలీవుడ్ కు చెందిన స్టార్ బ్యూటీ దీపికా ప‌దుకొనే(Deepika) చిరంజీవితో న‌టింప చేసేందుకు టాక్స్ కొన‌సాగుతున్నాయ‌ని టాక్. అయితే దీనిపై ఇంకా క్లారిటీ ఇవ్వ‌లేదు ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి.

Also Read : Prabhas- Raja Saab Excitement :ప్ర‌భాస్ రాజా సాబ్ టీజ‌ర్ పై ఉత్కంఠ

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com