బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ కు బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చారు నటి దీపికా పదుకొనే. తమిళ యంగ్ డైరెక్టర్ అట్లీ కుమార్ తీసిన జవాన్ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రూ. 700 కోట్ల క్లబ్ కు చేరుకుంది. ఈ సందర్బంగా జవాన్ సక్సెస్ మీట్ జరిగింది.
ఈ సందర్భంగా ఎవరూ ఊహించని రీతిలో జవాన్ సక్సెస్ ను ఎంజాయ్ చేసింది మొత్తం టీం. అంతా చూస్తూ ఉండగానే సినిమా విజయాన్ని తట్టుకోలేక నటి దీపికా పదుకొనే స్టేజి పైనే బాద్ షా షారుక్ ఖాన్ కు మరిచి పోలేని రీతిలో ముద్దు పెట్టారు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కిస్ ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. సెప్టెంబర్ 7న జవాన్ విడుదలైంది. స్టార్టింగ్ నుంచి ఇప్పటి దాకా జవాన్ రికార్డుల మోత మోగిస్తోంది. వసూళ్లలో సునామీ సృష్టిస్తోంది. విడుదలైన వెంటనే తక్కువ రోజుల్లో ఇంత భారీ ఎత్తున కలెక్షన్లను కొల్లగొట్టడం సినీ వర్గాలను విస్తు పోయేలా చేసింది.
ఈ ఏడాది బాద్ షా షారుక్ ఖాన్ కు మరిచి పోలేని సంవత్సరంగా మిగిలి పోతుంది. దీపికా పదుకొనేతో కలిసి పఠాన్ తీశాడు. ఇది రూ. 1,000 కోట్లు సాధించింది. ఈ సందర్బంగా నటుడు షారుక్ ఖాన్ ప్రత్యేకించి ఈ సినిమా సక్సెస్ వెనుక ప్రధాన కారకుడు కేవలం దర్శకుడు అట్లీ కుమార్ అని కొనియాడారు.
