Rajnath Singh : కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సంచలన ప్రకటన చేశారు. ఆదివారం ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఆపరేషన్ సిందూర్ తో యావత్ ప్రపంచానికి భారత దేశం బలం ఏమిటో చూపించామన్నారు. పాకిస్తాన్ పదే పదే కావాలని భారత్ తో కయ్యానికి కాలు దువ్వుతోందన్నారు.
Union Minister Rajnath Singh Shocking Comments
రావిల్పిండిలోని పాక్ సైనిక ప్రధాన కార్యాలయం వరకు తమ సైన్యం పవర్ ను చూపించిందన్నారు. దీంతో పాకిస్తాన్ కాళ్ల బేరానికి వచ్చిందన్నారు. తాము ఏనాడూ ఉగ్రవాద చర్యలను ప్రోత్సహించ లేదంటూ చెప్పారు రాజ్ నాథ్ సింగ్(Rajnath Singh). భారత ధృఢ సంకల్పం, సైనిక శక్తికి నిదర్శనంగా నిలుస్తుందన్నారు.
భారత్ కు వ్యతిరేకంగా వ్యవహరించే ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నా తాము వెంటాడి మట్టు పెడతామని వార్నింగ్ ఇచ్చారు. సీమాంతర ఉగ్రవాదానికి ఊతం ఇస్తోందంటూ పాకిస్తాన్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇవాళ భారత త్రివిధ దళాలు చేసిన సాహసోపేత ధైర్య సాహసాలకు 140 కోట్ల మంది భారతీయులు జేజేలు పలుకుతున్నారని చెప్పారు.
తాము పాకిస్తాన్ పౌరులను లక్ష్యంగా చేసుకోలేదన్నారు. కానీ పాకిస్తాన్ మాత్రం భారత పౌరులతో పాటు ఆలయాలను, ప్రార్థనా మందిరాలను టార్గెట్ చేసుకుని దాడులకు పాల్పడిందని ఆరోపించారు. ఇక నుంచి తమతో ఎవరు కాలు దువ్వినా యుద్దానికి సిద్దమేనని ప్రకటించారు రాజ్ నాథ్ సింగ్.
Also Read : Operation Sindoor Sensational :ఆపరేషన్ సిందూర్ కొనసాగిస్తాం
