కొరటాల శివ దర్శకత్వంలో దేవర మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ , జాహ్నవి కపూర్ నటిస్తున్నారు. మూవీకి సంబంధించి రోజుకో అప్ డేట్ వస్తోంది. షూటింగ్ శర వేగంగా కొనసాగుతోంది. ఎలాగైనా సరే ప్రకటించిన తేదీ మేరకే విడుదల చేసేందుకు దర్శకుడు కొరటాల శివ ఫోకస్ పెట్టాడు.
ఇంకా సినిమా విడుదల కాలేదు అప్పటికే స్ట్రీమింగ్ కు సంబంధించి డిస్కషన్స్ పూర్తయినట్లు టాక్. భారీ ధరకు ఓ ఓటీటీ సంస్థ చేజిక్కించుకున్నట్లు టాలీవుడ్ లో సమాచారం . ఇక టేకింగ్ లో మేకింగ్ లో మోస్ట్ పవర్ ఫుల్ డైరెక్టర్ గా గుర్తింపు పొందారు కొరటాల శివ.
ఆయన మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ , పూజా హెగ్డేతో తీసిన ఆచార్య అట్టర్ ప్లాప్ అయ్యింది. దీంతో శివతో ఎవరూ సినిమా తీసేందుకు ముందుకు రాలేదు. కానీ తనతో సినిమా తీసి బ్లాక్ బస్టర్ ఇవ్వడంతో డైరెక్టర్ పై నమ్మకాన్ని ఉంచారు జూనియర్ ఎన్టీఆర్.
దేవర అంటే దేవుడు అని అర్థం. ఈ సినిమాకు కథ, దర్శకత్వం వహిస్తున్నారు కొరటాల శివ. పూర్తిగా యాక్షన్ , డ్రామా ఉండేలా చేస్తున్నాడు దర్శకుడు. యువ సుధ ఆర్ట్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరి కృష్ణ నిర్మిస్తున్నారు.