Devara Movie Overseas Bookings..
ఓ వైపు రెండు తెలుగు రాష్ట్రాల్లో దేవర(Devara) టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటు, ప్రీమియర్ షోస్లకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేకమైన అనుమతులు రావడంతో దేవర టీం మంచి జోరులో ఉంది. ఈ క్రమంలో తాజాగా సినిమా ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ కూడా రికార్డులు తిరగరాస్తుండడంతో అభిమానులు సంబురాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే ప్రీమియర్ షోస్తో పాటు డే వన్ బుకింగ్స్ దాదాపు $4.7 – $5 మిలియన్ డాలర్లు అంటే సుమారు 37-42 కోట్ల వసూళ్లను రాబట్టనుంది. ఒకవేళ పాజిటివ్ మౌత్ టాక్ వస్తే రెండో రోజుకే ఇది $5.5 మిలియన్ డాలర్లు అంటే సుమారు 46 కోట్లకు చేరనుంది. మరోవైపు అమెరికాలో ఒక్కో టికెట్ ధర $30 డాలర్లుగా ఉండటంతో అభిమానులు పెదవి విరుస్తున్నారు. ఇంతా పెట్టి టికెట్ కొన్నాకా సినిమా ఏదైన తేడా కొడితే బాగోదని కామెంట్ చేస్తున్నారు.