Idli Kadai : కోలీవుడ్ లో విలక్షణ నటుడిగా పేరొందాడు ధనుష్. తను నటించడమే కాకుండా దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా నిత్య మీనన్ తో కలిసి తాను తీసిన ఇడ్లి కడై(Idli Kadai) చిత్రం పోస్టర్, టీజర్ ను రిలీజ్ చేశారు. సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఇలా ప్రతిదీ తానే దగ్గరుండి చూసుకుంటున్నాడు. ప్రత్యేకించి స్టోరీని భిన్నంగా ఉండేలా జాగ్రత్త పడుతున్నాడు. ఈ సమయంలో ఇడ్లి కడైకి సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది.
Dhanush Idli Kadai Movie Updates
అదేమిటంటే వచ్చే అక్టోబర్ 2న దసరా పర్వదినం పురస్కరించుకుని ఇడ్లి కడై సినిమాను విడుదల చేస్తున్నట్లు ప్రకటించాడు హీరో , దర్శకుడు ధనుష్. గత ఏడాది తాను తీసిన రాయన్ సూపర్ సక్సెస్ అయ్యింది. ఈ ఏడాదిలో తాను తీసిన మరో మూవీ జాబిలమ్మ నీకు అంత కోపమా ఆశించిన దానికంటే అత్యధిక వసూళ్లను సాధించింది. సినీ క్రిటిక్స్ ను విస్తు పోయేలా చేసింది.
తమిళంలో తీసిన ఇడ్లి కడై చిత్రాన్ని తెలుగులో ఇడ్లి కొట్టుగా వస్తోంది. ఇప్పటికే ఈ మూవీని ఆగస్టులో విడుదల చేయాలని భావించారు. ఇదే క్రమంలో కోలీవుడ్ సూపర్ స్టార్ తలైవా రజనీకాంత్ నటించిన కూలీ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ అదే రోజు రిలీజ్ కానుండడంతో ఇడ్లి కడైని దసరా రోజున రిలీజ్ చేయాలని నిర్ణయించారు ధనుష్.
Also Read : Beauty Meenakshi Chaudhary :అవకాశం వస్తే బాలయ్యతో నటించేందుకు సిద్దం