Anurag Kashyap : బాలీవుడ్ లో తను దమ్మున్న డైరెక్టర్. అతను ఎవరో కాదు అనురాగ్ కశ్యప్. ఇటీవల తాను చేసిన కామెంట్స్ దేశ వ్యాప్తంగా చర్చకు, వివాదానికి దారి తీశాయి. ప్రత్యేకించి ఒక సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. కులతత్వంతో సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నారంటూ అనురాగ్ బ్రాహ్మణ ఆధిపత్య ధోరణిని ప్రశ్నించాడు. నిలదీశాడు. దీంతో బ్రాహ్మణ సమాజం ఒక్కటిగా గొంతు చించుకుంది. తను బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది.
Director Anurag Kashyap Shocking Comments
ఈ తరుణంలో అనురాగ్ కశ్యప్(Anurag Kashyap) పై నిరసన వ్యక్తం అవుతోంది. సోషల్ మీడియాలో ఆయన ప్రస్తుతం తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. కాగా మరో వైపు సమాజంలో ప్రజల వైపు ఆలోచన కలిగిన మేధావులు, బుద్ది జీవులు, కుల వివక్షకు వ్యతిరేకంగా పని చేస్తున్న వారంతా దర్శకుడు అనురాగ్ కశ్యప్ కు మద్దతు ఇస్తున్నారు. ఈ తరుణంలో ముంబైలో తనపై కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో దర్శకుడిపై కేసు నమోదు చేశారు. తమ కులాన్ని దూషించాడని, తమను అవమానించాడని పేర్కొన్నారు ఇందులో. కాగా ఈ ఫిర్యాదు చోటు చేసుకోవడంతో ఏప్రిల్ 18న కశ్యప్ సారీ చెప్పాడు.
పూలే చిత్ర నిర్మాత కావడం విశేషం. ఒక వర్గాన్ని కించపరిచి ఉండాల్సింది కాదన్నాడు దర్శకుడు. ఇదిలా ఉండగా తనపై భారతీయ జనతా పార్టీ మహారాష్ట్ర న్యాయ సలహా విభాగం చీఫ్ , న్యాయవాది అశు తోష్ జె దూబే పోలీసులకు కంప్లెయింట్ ఇచ్చారు. ఆయనపై చర్ట పరంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇటువంటి ద్వేష పూరిత కామెంట్స్ హర్షించదగ్గవి కాదన్నాడు. మొత్తంగా పూలే చిత్రం వివాదాస్పదం కావడం గమనార్హం.
Also Read : Hero Simbu-Trisha :పదిహేనేళ్ల తర్వాత త్రిష..శింబు కలయిక
