తార‌క్ ఫ్యాన్స్ కు ప్ర‌శాంత్ నీల్ షాక్

పుట్టిన రోజు మే 20న గ్లింప్స్ ఉండ‌దు

ఇండియ‌న్ సినిమాను రెండే రెండు సినిమాలు తీసి షేక్ చేసిన ద‌ర్శ‌కుడు క‌న్న‌డ సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన డైన‌మిక్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్. త‌ను ఇప్పుడు ప్ర‌తిష్టాత్మ‌కంగా డ్రాగ‌న్ పేరుతో సినిమా తీస్తున్నాడు. ఇప్ప‌టికే షూటింగ్ కూడా మొద‌లు పెట్టాడు. ఇందులో జూనియ‌ర్ ఎన్టీఆర్ కీ రోల్ పోషిస్తున్నాడు. ఎప్ప‌టిక‌ప్పుడు అప్ డేట్స్ ఇస్తూ మ‌రింత ఆసక్తిని రేపుతూ వ‌చ్చాడు. తాజాగా ఇందుకు సంబంధించి తార‌క్ పుట్టిన రోజు సంద‌ర్బంగా మూవీ గ్లింప్స్ ను రిలీజ్ చేస్తాన‌ని ప్ర‌క‌టించాడు.

కానీ ఇవాళ బాంబు పేల్చాడు. తాను మే20న అలాంటిది ఏదీ ఉండ‌బోదంటూ తెలిపాడు. దీంతో తార‌క్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశ‌కు గుర‌య్యాడు. అయితే పోస్ట‌ర్స్ మాత్రం కెవ్వు కేక అనిపించేలా ఉన్నాయి. ఇక ప్ర‌శాంత్ నీల్ అంటేనే త‌న టేకింగ్, మేకింగ్ ఇత‌ర ద‌ర్శ‌కుల కంటే భిన్నంగా ఉంటుంది. త‌ను ఏది అనుకున్నాడో అది వ‌చ్చేంత దాకా న‌టీ న‌టుల‌ను పిండేస్తాడు. త‌ను నిద్ర పోడు. ఇత‌ర న‌టీ న‌టుల‌ను నిద్ర పోనివ్వ‌డు.

మ‌రో వైపు తార‌క్ కూడా అంతే. త‌ను ద‌ర్శ‌కుల హీరో. ఎన్ని టేకులైనా స‌రే న‌టించేందుకు సిద్దంగా ఉంటాడు. కార‌ణం ఆ సీన్ పండేంత వ‌ర‌కు తాను కూడా ఇష్ట ప‌డ‌డు. ఇక ఇద్ద‌రు ద‌మ్మున్న వాళ్లు కావ‌డంతో వ‌చ్చేది డ్రాగ‌న్ కావ‌డంతో మ‌రింత మార్కెట్ లో విప‌రీత‌మైన బ‌జ్ ఏర్ప‌డింది. జూనియ‌ర్ ఎన్టీఆర్ స్టార్ ఇమేజ్ , పాన్ ఇండియా ఫేవ‌రేట్ డైరెక్ట‌ర్ నీల్ కాంబోలో వ‌స్తున్న ఈ మూవీ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. మ‌రి ఎందుక‌ని గ్లింప్స్ విడుద‌ల చేయ‌డం లేద‌నే దానిపై ఇంకా క్లారిటీ ఇవ్వ‌లేదు ద‌ర్శ‌కుడు.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com