ప్రముఖ తెలుగు చలన చిత్ర దర్శకుడు శ్రీరామ్ వేణు కీలక వ్యాఖ్యలు చేశారు. తను గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ తీశాడు. ఇది మంచి ప్రజాదరణ పొందింది. ఆ తర్వాత ఐకాన్ పేరుతో సినిమా తీసేందుకు చాలా కష్టపడ్డాడు. ఇందుకు సంబంధించి స్క్రిప్టు కూడా సిద్దం చేశాడు. ఇదే సమయంలో పుష్ప -2 మూవీ షూటింగ్ సమయంలో బిజీగా ఉన్నప్పటికీ అల్లు అర్జున్ కు వినిపించాడు. తనకు నచ్చింది తను చెప్పిన కథ. ఇద్దరూ కలిసి ఒక ఏడాది పాటు ప్రయాణం చేశారు. కానీ వివిధ కారణాల రీత్యా సినిమా ఆగి పోయింది. అయినా తను నిరాశ చెందలేదు.
ప్రస్తుతం నితిన్ రెడ్డితో తమ్ముడు చిత్రాన్ని తీశాడు. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ చేశాడు. ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో చాలా ఏళ్ల తర్వాత ప్రముఖ నటి లయ కీ రోల్ పోషిస్తుండడం విశేషం. ఈనెల 4వ తేదీన శుక్రవారం ప్రేక్షకులు ముందుకు రానుందని ప్రకటించారు దర్శకుడు శ్రీరామ్ వేణు. ఈ సందర్బంగా చిట్ చాట్ చేశారు. ఐకాన్ ఎవరి కోసం అన్న మీడియా ప్రశ్నలకు కీలక సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు.
ఐకాన్ అనేది నా కలల ప్రాజెక్టు. ఎన్నో ఏళ్లుగా దాని కోసం కష్టపడ్డాను. ఇప్పుడు కాక పోవచ్చు. కానీ త్వరలోనే దానిపై ఫోకస్ పెడతానని ప్రకటించాడు. అది బన్నీ కాక పోవచ్చు..ఇంకొక హీరోతో కావచ్చు..కానీ ఎవరన్నది ఇప్పుడే చెప్పలేమని కానీ సినిమా తీయడం ఖాయమని స్పష్టం చేశాడు శ్రీరామ్ వేణు.