పుష్ప మూవీ ఇండియన్ సినిమాను షేక్ చేసిన దర్శకుడు సుకుమార్. ఈ ఒక్క మూవీ తనను ఆకాశానికి ఎత్తేసేలా చేసింది. ఆపై అల్లు అర్జున్ ను ప్యాన్ ఇండియా స్టార్ గా మార్చేసింది. సమంత, శ్రీలీలకు స్పెషల్ సాంగ్స్ లలో నటించే ఛాన్స్ లు దక్కేలా చేసింది. అంతే కాదు నేషనల్ క్రష్ గా రష్మిక మందన్నాను మార్చేసింది. ఈ క్రెడిట్ అంతా సుకుమార్ కే దక్కింది. పుష్ప -2 ఏకంగా ఇండియన్ సినీ హిస్టరీలో సంచలనం రేపింది.
ఏకంగా రూ. 1867 కోట్లు వసూలు చేసింది. ఈ విషయాన్ని సినిమాను తీసిన , నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా ఎక్స్ వేదికగా ప్రకటించింది. ఆ తర్వాత సుకుమార్ తదుపరి ప్రాజెక్టు ఎవరితో ఉంటుందనే దానిపై ఉత్కంఠకు తెరదించే ప్రయత్నం చేశాడు. పుష్ప -3 ఉంటుందని స్పష్టం చేశాడు. ప్రస్తుతం బన్నీ బిజీగా మారాడు. భారీ ప్రాజెక్టుకు ఓకే చెప్పాడు. తను అట్లీ, సన్ పిక్చర్స్ తో మూవీ చేస్తున్నాడు. దీనికి సంబంధించి కీలక ప్రకటన చేశాడు దర్శకుడు.
ఈ సమయంలో సుకుమార్ ఎవరితో సినిమా ఉంటుందనే దానిపై క్లారిటీ ఇచ్చాడు ఇవాళ. తను తన స్వస్థలమైన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మలికిపురం మండలం మట్టపర్రు ఊరుకు కుటుంబ సమేతంగా విచ్చేశారు. గ్రామస్తులు, చిన్ననాటి స్నేహితులు, బంధువులతో ఆనందంగా గడిపారు.
ఈ సందర్భంగా సుకుమార్ మీడియాతో మాట్లాడారు. గ్లోబల్ స్టార్ హీరో రామ్ చరణ్‌తో సినిమా తీసేందుకు కథ సిద్ధం చేసినట్లు చెప్పారు. చిత్రీకరణ ఎప్పుడు ప్రారంభించేది త్వరలో వెల్లడిస్తానన్నారు. తమ కాంబినేషన్‌లో వచ్చిన ‘రంగస్థలం’ చిత్రం అప్పట్లో ఇండస్ట్రీలో హిట్‌గా నిలిచిందన్నారు. ఆ తర్వాత ‘ఆర్ఆర్ఆర్’తో రామ్ చరణ్ పాన్ ఇండియా స్థాయికి ఎదిగారని అన్నారు.ఆయనతో తాను తీయబోయే సినిమా ఆ స్థాయిలోనే ఉంటుందని పేర్కొన్నారు.
