హైదరాబాద్ వేదికగా మిస్ వరల్డ్ 2025 పోటీలు ముగిశాయి. ఈ పోటీలలో 108 దేశాలకు పైగా సుందరీమణులు పాల్గొన్నారు. చివరకు ఎనిమిది మందిని ఎంపిక చేశారు. ఫైనల్ లో ముగ్గురు నిలిచారు. థాయిలాండ్ కు చెందిన సుందరి విశ్వ సుందరిగా ఎంపికైంది. పలు ప్రశ్నలకు ఆమె తడుము కోకుండా సమాధానం ఇచ్చారు. తనకంటూ ఓ ప్రత్యేకమైన కథ ఉంది. 16 ఏళ్ల వయసులో తను రొమ్ము క్యాన్సర్ బారిన పడింది. దానిని అధిగమించింది. తను ప్రపంచ వ్యాప్తంగా వివిధ స్వచ్ఛంధ సేవా సంస్థల సహకారంతో సామాజిక సేవా కార్యక్రమాలలో పాలు పంచుకుంటోంది.
మిస్ వరల్డ్ పోటీలలో పాల్గొని గెలుపొందిన వారంతా రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిశారు. ఈ సందర్బంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు ఈ కార్యక్రమానికి. ఇందులో పుష్ప -2 డైరెక్టర్ సుకుమార్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారాడు. ఇదే సమయంలో విశ్వ సుందరి గా ఎంపికైన థాయిలాండ్ సుందరి ఓపాల్ సుచతా చువాంగ్ శ్రీతో కాసేపు ముచ్చటించారు సుకుమార్. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
మే 31న మిస్ వరల్డ్ 2025 కిరీటాన్ని పొందింది. 21 ఏళ్ల ఈమెకు మునుపటి సంవత్సరం మిస్ వరల్డ్ 2024 విజేత, చెక్ రిపబ్లిక్‌కు చెందిన క్రిస్టినా పిజ్జ్‌కోవా కిరీటాన్ని అలంకరించారు. ఫుకెట్‌కు చెందిన ఒపాల్, థమ్మసాట్ విశ్వ విద్యాలయంలోని పొలిటికల్ సైన్స్ ఫ్యాకల్టీలో రాజకీయాలు, అంతర్జాతీయ సంబంధాలలో బ్యాచిలర్ డిగ్రీని అభ్యసిస్తోంది.
తను చైనీస్ భాషలో ప్రావీణ్యం కలిగి ఉంది, బ్యాంకాక్‌లోని ట్రయామ్ ఉడోమ్ సుక్సా స్కూల్ నుండి చైనీస్ భాషలో ప్రత్యేకతతో పట్టభద్రురాలైంది కూడా. తనకు జంతువులంటే ప్రేమ. రొమ్ము క్యాన్సర్ పై అవగాహన కల్పిస్తోంది. ఇదిలా ఉండగా విశ్వ సుందరిని కలిశాక గవర్నర్ తో భేటీ అయ్యారు దర్శకుడు సుకుమార్.
