లోక నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ కు బంప‌ర్ ఆఫ‌ర్

సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్

త‌మిళ చ‌ల‌న చిత్ర రంగంలో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌త‌ను క‌లిగిన ఏకైక న‌టుడు ఇల‌య నాయ‌గ‌న్ (లోక నాయ‌కుడు) క‌మ‌ల్ హాస‌న్ కు అరుదైన ఆఫ‌ర్ ఇచ్చింది డీఎంకే పార్టీ. గ‌తంలో జ‌రిగిన ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఇచ్చిన మాట ప్ర‌కారం పార్టీ తర‌పున రాజ్య‌స‌భ‌కు క‌మ‌ల్ హాస‌న్ ను నామినేట్ చేయాల‌ని నిర్ణ‌యించారు. దీంతో సినీ వ‌ర్గాల‌లో హ‌ర్షాతిరేక‌లు వ్య‌క్తం అవుతున్నాయి. మ‌రో వైపు అగ్ర న‌టుడు ద‌ళ‌ప‌తి విజ‌య్ స్వంతంగా టీవీకే పార్టీని స్థాపించాడు. త‌న చివ‌రి చిత్రం 69లో న‌టిస్తున్నాడు.

తాజాగా సీఎం ఎంకే స్టాలిన్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశాడు. పార్టీ ప‌రంగా ఏక‌గ్రీవంగా తీర్మానం చేశామ‌ని, ఇల‌య నాయ‌గ‌న్ కు రాజ్య‌సభ సీటు ఇచ్చేందుకు తీర్మానం చేశామ‌న్నాడు. చిత్ర ప‌రిశ్ర‌మ‌లో విశిష్ట సేవ‌లు అందించాడు. అంతే కాదు విల‌క్ష‌ణ న‌టుడిగా గుర్తింపు పొందాడు. తాజాగా మ‌ణిర‌త్నం తీసిన థ‌గ్ లైఫ్ లో కీ రోల్ పోషించాడు. ఈ మూవీ జూన్ 5న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఇప్ప‌టికే సూప‌ర్ టాక్ తెచ్చుకుంది.

ఈ త‌రుణంలో రాజ‌కీయ వ‌ర్గాల‌ను విస్మ‌య ప‌రిచేలా ఇల‌య నాయ‌గ‌న్ కు రాజ్య‌స‌భ సీటు ఖ‌రారు చేశారు ఎంకే స్టాలిన్. రాబోయే శాస‌న స‌భ ఎన్నిక‌లు ప్ర‌తిష్టాత్మ‌కంగా మార‌బోతున్నాయి. ఇప్ప‌టి నుంచే క‌స‌ర‌త్తు ప్రారంభించారు. ఈ త‌రుణంలో అత్యంత జ‌నాద‌ర‌ణ క‌లిగిన న‌టుల మ‌ధ్య హోరా హోరీ పోరు కొన‌సాగ‌నుంది. మొత్తంగా క‌మ‌ల్ హాస‌న్ కు బంప‌ర్ ఆఫ‌ర్ త‌గ‌ల‌డం ప‌ట్ల స‌ర్వ‌త్రా హ‌ర్షం వ్య‌క్తం అవుతోంది.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com