Dokka Seethamma : తనకు లేక పోయినా ఆకలి తీర్చిన గొప్ప వ్యక్తి డొక్కా సీతమ్మ. ఆమె కథ ఎందరికో ఆదర్శ ప్రాయం. డొక్కా సీతమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆమె గురించి ఎక్కువగా వెలుగులోకి తీసుకు వచ్చేలా చేసింది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. తాజాగా వెండి తెర మీదకు త్వరలో రాబోతోంది. ఇందులో మురళీ మోహన్,, ఆమని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఉషారాణి మూవీస్ బ్యానర్ మీద వల్లూరి రాంబాబు నిర్మిస్తున్నారు. టీవీ రవి నారాయణ్ దర్శకత్వం వహిస్తున్నారు.
Dokka Seethamma Movie Updates
ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ(Dokka Seethamma) చిత్రానికి రాహుల్ శ్రీవాస్తవ్ కెమెరామెన్ గా పని చేశారు. కార్తీక్ కొడకండ్ల సంగీతం అందించారు. ఈ మూవీకి సంబంధించిన టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మూవీ మేకర్స్. అంబికా కృష్ణ, రేలంగి నరసింహారావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. డొక్కా సీతమ్మ లాంటి మహనీయురాలి కథను సినిమాగా రూపొందించడం అభినందనీయమన్నారు. ఇలాంటి వారి గురించి జనాలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు.
ఒకటా రెండా ఏకంగా 400 ఎకరాలను అమ్మేసి అందరికీ అన్నం పెట్టిన మహనీయురాలు డొక్కా సీతమ్మ అని కొనియాడారు. అంతటి గొప్ప వ్యక్తి పాత్రను ఆర్టిస్ట్ ఆమని నటించడంతో మరింత గౌరవం పెరుగుతుందన్నారు. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న రాంబాబు, దర్శకుడికి ముందుగా అభినందనలు తెలియ చేస్తున్నట్లు పేర్కొన్నారు. అందరి లాగే చిరంజీవిని చూసి అభిమానిగా మారానని అన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ద్వారా ఆమె చరిత్ర తెలుసుకుని సినిమా చేస్తున్నానని చెప్పారు.
Also Read : Malla Reddy Shocking :లవ్ యువర్ ఫాదర్ హీరోయిన్ కసిగా ఉంది
