Raja saab : పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సారథ్యంలో మారుతి దర్శకత్వం వహిస్తున్న చిత్రం రాజా సాబ్(Raja saab). ఇప్పటికే ప్రకటించిన విధంగా సినిమా విడుదల కాక పోవడంతో పాన్ ఇండియా హీరో ప్రభాస్ అభిమానులు ఊగి పోతున్నారు. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పూర్తి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు దర్శకుడు. తన ఒక్కడి వల్ల సినిమా పూర్తి కాదని, దీని వెనుక వందలాది మంది సాంకేతిక నిపుణుల శ్రమ దాగి ఉంటుందని, అర్థం చేసుకుని సహకరించాలని కోరారు. కథా పరంగా ఇప్పటికే పూర్తిగా రొమాంటిక్, సస్పెన్స్, థ్రిల్లర్ నేపథ్యంతో దీనిని తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు దర్శకుడు.
Raja saab Movie Updates
ఈ సందర్బంగా మూవీ మేకర్స్ గతంలో ఏప్రిల్ 10న రాజా సాబ్(Raja saab) ను విడుదల చేస్తామని ప్రకటించారు. కానీ ఇంకా సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా పెండింగ్ లో ఉండడంతో తేదీని వాయిదా వేశారు. దీంతో తీవ్ర స్థాయిలో భగ్గుమంటున్నారు. గత ఏడాది ప్రభాస్ నటించిన కల్కి సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. దీనిని సీక్వెల్ గా తీస్తున్నాడు దర్శకుడు నాగ్ అశ్విన్. మరో వైపు ఫాజీ మూవీలో బిజీగా ఉన్నాడు. ఇక వేసవి కాలం రావడంతో వెకేషన్ కోసం నటుడు ప్రభాస్ ఇటలీలో సేద దీరుతున్నాడు. తనకు అక్కడ ఓ ఫ్లాట్ కూడా ఉంది. వేసవి పూర్తయ్యాక జూన్ నెలలో తిరిగి వస్తాడని, సినిమా షూటింగ్ లో పాల్గొంటాడని తన టీం వెల్లడించింది.
అయితే రాజా సాబ్ కు సంబంధించి కీలక అప్ డేట్ ఇచ్చాడు డైరెక్టర్ మారుతి. ఇంకా కీలకమైన సన్నివేశాలు తీయాల్సి ఉందని, మే నెలలో టీజర్, ట్రైలర్ ను రిలీజ్ చేస్తామని ప్రకటించాడు. ఇదిలా ఉండగా ఇప్పటికే సినిమాకు సంబంధించిన పోస్టర్స్, టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక టేకింగ్ , మేకింగ్ లో తనదైన ముద్ర కనబరుస్తూ వచ్చాడు మారుతి. తను చిన్నప్పుడు కష్టాల నుంచి వచ్చినవాడు కావడంతో తీసే మూవీపై ఎక్కువగా ఫోకస్ పెడుతున్నాడు. మొత్తంగా త్వరగా పూర్తి చేసి రాజా సాబ్ ను రిలీజ్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
Also Read : Renu Desai Shocking Comment :సెక్యులర్స్ మౌనం రేణూ దేశాయ్ ఆగ్రహం