Hero Dulquer Salmaan : దుల్క‌ర్ స‌ల్మాన్ ఐయామ్ గేమ్ స్టార్ట్

న‌హాస్ హిదాయ‌త్ ద‌ర్శ‌క‌త్వం

Hero Dulquer Salmaan

Dulquer Salmaan : మాలీవుడ్ స్టార్ హీరో దుల్క‌ర్ స‌ల్మాన్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. త‌ను తెలుగు వారికి మ‌రింత సుప‌రిచితుడు కూడా. ఇటీవ‌లే త‌ను న‌టించిన ల‌క్కీ భాస్క‌ర్ మూవీ బిగ్ స‌క్సెస్ గా నిలిచింది. తాజాగా దుల్క‌ర్(Dulquer Salmaan) కీ రోల్ పోషిస్తున్న చిత్రం ఐయామ్ గేమ్. ఈ సినిమా షూటింగ్ ప్రారంభ‌మైంద‌ని ప్ర‌క‌టించాడు. సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించాడు. ఈ చిత్రానికి క్రియేటివిటీ డైరెక్ట‌ర్ గా పేరొందిన న‌హాస్ హిదాయ‌త్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌డం విశేషం.

Dulquer Salmaan Movie Updates

అద్భుత‌మైన సాంకేతిక బృందంతో ఈ చిత్రం తెర‌కెక్కుతోంద‌ని తెలిపాడు. ఒక రోజు ముందు చిత్ర నిర్మాత‌లు త‌మిళ మూవీ అగ్ర ద‌ర్శ‌కుల‌లో ఒక‌డైన మిస్కిన్ ను ఈ కొత్త ప్రాజెక్టులోకి రాబోతున్నార‌ని ప్ర‌క‌టించారు. ఇదే క్ర‌మంలో ద‌ర్శ‌కుడు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. బ‌హుముఖ ప్ర‌జ్ఞాశాలి సినిమా ప‌రంగా మిస్కిన్ . త‌న‌ను ఆహ్వానిస్తున్నందుకు ఆనందంగా ఉంద‌న్నాడు. త‌ప్ప‌కుండా అన్ని వ‌ర్గాల‌ను ఆక‌ట్టుకునేలా త‌మ మూవీ ఉంటుంద‌ని హామీ ఇస్తున్నాన‌ని పేర్కొన్నాడు.

దుల్క‌ర్ స‌ల్మాన్ తో పాటు మిస్కిన్ తోడు కానుండ‌గా త‌న‌తో మ‌రో న‌టుడు స్క్రీన్ పంచుకోనున్నాడు. అంగ‌మ‌లే డైరీస్ ఫేమ్ ఆంటోనీ న‌ర్గీస్ కూడా కీ రోల్ పోషించ‌నున్నాడ‌ని తెలిపాడు ద‌ర్శ‌కుడు. సినిమాకు సంబంధించి టైటిల్ పోస్ట‌ర్ ను రిలీజ్ చేశారు. ఇక దుల్క‌ర్ కెరీర్ లో ఈ మూవీ 40వ‌ది. ఐయామ్ గేమ్ చిత్రానికి క‌థ‌ను న‌మాస్ అందించ‌గా స్క్రీన్ ప్లేను న‌జీర్ బాబా , బిలాల్ మొయిదు, ఇస్మాయిల్ అబూబాక‌ర్ అందించారు.

Also Read : Beauty Nabha Natesh : న‌భా న‌టేష్ ఫోటోస్ వైర‌ల్

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com