ఆహాలో దుల్క‌ర్ స‌ల్మాన్ మూవీ స్ట్రీమింగ్

మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్ అయిన చిత్రం

దుల్క‌ర్ స‌ల్మాన్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. అంత‌కంటే ప‌రిచ‌యం అక్క‌ర్లేదు కూడా. త‌ను విల‌క్ష‌ణ న‌టుడిగా పేరొందాడు. అంతే కాదు ఏ పాత్ర ఇచ్చినా దానికి వంద శాతం న్యాయం చేస్తాడు. ఇది త‌న ప్ర‌త్యేక‌త‌. ఈ మ‌ధ్య‌న త‌ను న‌టించిన ల‌క్కీ భాస్క‌ర్ సూప‌ర్ హిట్. తెలుగులో వ‌చ్చిన ఈ మూవీని పెద్ద ఎత్తున ఆద‌రించారు ప్రేక్ష‌కులు. దుల్క‌ర్ స‌ల్మాన్ ను త‌మ ఇంటి వాడిగా మార్చేసుకున్నారు. మ‌ధ్య త‌ర‌గ‌తి జీవితం, డ‌బ్బు విలువ‌, వ‌స్తువుల వ్యామోహం, ఇలా చెప్పుకుంటూ పోతే నేటి సమాజంలో జ‌రుగుతున్న ప్ర‌తి అంశాన్ని తెర‌పై ఆవిష్క‌రింప చేశాడు ద‌ర్శ‌కుడు.

ఈ స‌మ‌యంలో దుల్క‌ర్ స‌ల్మాన్ మ‌రో కొత్త ప్రాజెక్టుల‌లో న‌టిస్తున్నాడు. తాజాగా త‌ను మ‌ల‌యాళంలో న‌టించిన పేరు పొందిన మూవీస్ ను తెలుగులో డ‌బ్ చేసి వ‌దులుతున్నారు. తాజాగా ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ ఆహాలో దుల్క‌ర్ న‌టించిన , హిట్ చిత్రం ఒరు య‌మండ‌న్ ప్రేమ క‌థ చిత్రాన్ని ఒక యముడి ప్రేమ క‌థ పేరుతో స్ట్రీమింగ్ చేస్తోంది. ఇది పూర్తిగా కామెడీగా రూపొందించాడు ద‌ర్శ‌కుడు.

ఇందులో దుల్క‌ర్ స‌ల్మాన్ మ‌రోసారి త‌నలోని న‌టుడిని ప్ర‌ద‌ర్శించాడు . ఇక త‌ను రాణా ద‌గ్గుబాటికి చెందిన స్పిరిట్ మీడియా నిర్మిస్తున్న కాంతా, స్వ‌ప్న నిర్మాణంలో రూపొందుతున్న ఆకాశంలో ఒక తార అనే తెలుగు మూవీస్ లో భాగం పంచుకున్నాడు. ఈ రెండు సినిమాలకు సంబంధించిన షూటింగ్ శ‌ర‌వేగంగా కొన‌సాగుతోంది. స్టార్ ఇమేజ్ ఉన్న‌ప్పుడే రిలీజ్ చేస్తే కాసులు వ‌స్తాయ‌ని నిర్మాత‌లు భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయా భాష‌ల‌లో టాప్ లో కొన‌సాగుతున్న వాటిని స్ట్రీమింగ్ చేస్తున్నారు. మొత్తంగా థియేట‌ర్ల కంటే ఓటీటీల‌కే ఎక్కువ ప్ర‌యారిటీ ఇస్తున్నారు ప్రేక్ష‌కులు.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com