ఎలాన్ మ‌స్క్..ట్రంప్ మ‌ధ్య విభేదాలు

ట్రంప్ పై అభిశంస‌న తీర్మానం పెట్టాలి

FILE - Elon Musk, left, shakes hands with President Donald Trump at the finals for the NCAA wrestling championship, March 22, 2025, in Philadelphia. (AP Photo/Matt Rourke, File)

టెస్లా చైర్మ‌న్, ట్విట్ట‌ర్ సిఇఓ ఎలాన్ మ‌స్క్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో ట్రంప్ కు బేష‌ర‌తు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించి గెలిపించిన మ‌స్క్ ఉన్న‌ట్టుండి ట్రంప్ ను టార్గెట్ చేశారు. ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ‌లు ముదిరి పాకాన ప‌డ్డాయి. ట్రంప్ పై అభిశంస‌న తీర్మానం పెట్టాల‌ని డిమాండ్ చేశారు. ట్రంప్ ను తొల‌గించి జేడీ వ్యాన్స్ ను అధ్య‌క్షుడిని చేయాల‌ని కోరాడు. దీంతో త‌న కంపెనీకి చెందిన షేర్లు 14 శాతానికి ప‌డి పోయాయి. దీని కార‌ణంగా మ‌స్క్ కు 150 బిలియ‌న్ డాల‌ర్ల న‌ష్టం వాటిల్లింది.

అమెరికాలో ఈ ఇద్ద‌రి మ‌ధ్య నెల‌కొన్న విభేదాలు తారా స్థాయికి చేరుకోవ‌డం విస్తు పోయేలా చేసింది. గ‌త జో బైడెన్ ప్ర‌భుత్వంపై నిప్పులు చెరిగారు మ‌స్క్. త‌న సామ్రాజ్యాన్ని విస్త‌రించుకుంటూ పోయాడు. ఓ వైపు కార్లు, ఇంకో వైపు సోష‌ల్ మీడియాలో ఆధిప‌త్యంతో పాటు స్పేస్ ఎక్స్ ను మ‌రింత బ‌లోపేతంపై ఫోక‌స్ పెట్టాడు. ట్రంప్ గెలిచిన త‌ర్వాత త‌న‌కు కీల‌క ప్రాధాన్య‌త ఇస్తూ వ‌చ్చాడు. అమెరిక‌న్లంద‌రి ముందు త‌ను లేక పోతే గెలిచి ఉండేవాడిని కాద‌ని ప్ర‌క‌టించాడు ట్రంప్.

కానీ అధికారంలోకి వ‌చ్చాక డొనాల్డ్ ట్రంప్ దుందుడుకుగా వ్య‌వ‌హ‌రించ‌డంతో పాటు త‌ల‌తిక్క నిర్ణ‌యాల‌తో ప‌రేష‌న్ చేయ‌డం మొద‌లు పెట్టాడు. ప్ర‌ధానంగా వ‌ల‌స అక్ర‌మ దారుల‌పై ఉక్కుపాదం మోపాడు. ఇక ట్రంప్ నిర్ణ‌యాలు మేలు చేయ‌క పోగా మ‌స్క్ వ్యాపారానికి నష్టం చేకూరేలా ఉండ‌డంతో ఎదురు తిరిగాడు . దీంతో ఇద్ద‌రి మ‌ధ్య వార్ ఏ మేర‌కు కొన‌సాగుతుంద‌నేది వేచి చూడాలి.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com