Hero Rajinikanth-Jailer 2 :త‌లైవాతో త‌ల‌ప‌డ‌నున్న ఫ‌హాద్ ఫాసిల్ 

జైల‌ర్ మూవీలో ప్ర‌తి నాయ‌కుడిగా రోల్ 

Hero Rajinikanth-Jailer 2

Jailer 2 : నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో జైల‌ర్ సీక్వెల్ మూవీ షూటింగ్ కొన‌సాగుతోంది. ఇందులో త‌లైవా ర‌జ‌నీకాంత్ కీ రోల్ పోషిస్తున్నాడు. త‌న‌తో పాటు టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున కూడా ఇందులో న‌టిస్తుండ‌డం విశేషం. దీనిని స‌న్ పిక్చ‌ర్స్ నిర్మిస్తోంది. ఇప్ప‌టికే విడుద‌లైన ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. తాజాగా రిలీజ్ చేసిన పోస్ట‌ర్ దుమ్ము రేపుతోంది. సోష‌ల్ మీడియాను షేక్ చేస్తోంది. కోలీవుడ్ లో కీల‌క అప్ డేట్ వ‌చ్చింది. అదేమిటంటే జైల‌ర్ సీక్వెల్ లో ప్ర‌తి నాయ‌కుడి పాత్ర కోసం మ‌ల‌యాళ న‌టుడు ఫ‌హాద్ ఫాసిల్ ను ఎంపిక చేసిన‌ట్లు స‌మాచారం.

Jailer 2 – Fahadh Fasil

దీనిపై ఇంకా క్లారిటీ ఇవ్వ‌లేదు ద‌ర్శ‌కుడు నెల్స‌న్ దిలీప్ కుమార్. ఇక ఈ మూవీ క‌ల‌క‌లం రేపుతోంది. స్టార్ ఇమేజ్ స్వంతం చేసుకున్న అరుదైన న‌టుడు ర‌జ‌నీకాంత్. త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ జైల‌ర్ 2(Jailer 2) ప్ర‌పంచ వ్యాప్తంగా రూ. 1000 కోట్ల మార్క్ ను దాటేసింది. సినిమాకు సంబంధించి కీల‌క అప్ డేట్ వ‌చ్చింది. ప్ర‌స్తుతం కేర‌ళ‌లో షూటింగ్ శ‌ర‌వేగంగా కొన‌సాగుతోంది. ఏజ్ పెరిగినా స‌రే యువ హీరోలతో పోటీ ప‌డి న‌టిస్తున్నారు. షెడ్యూల్ లో చురుకుగా పాల్గొంటున్నారు.

పెరుగుతున్న ఉత్సాహానికి తోడు న‌ట‌నా ప‌రంగా వంద మార్కులు పొందిన మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ ఫాసిల్ కూడా జైల‌ర్ 2 లో ప్ర‌తి నాయ‌కుడిగా ఎంట్రీ ఇవ్వనున్నార‌ని, త‌ను కూడా ఓకే చెప్పాడ‌ని పెద్ద ఎత్తున కోలీవుడ్ లో ప్ర‌చారం జ‌రుగుతోంది. త‌న‌ను ఫాఫా అని కూడా అభిమానులు పిలుచుకుంటారు. ఈ విష‌యం గురించి మూవీ మేక‌ర్స్ ఇంకా అధికారికంగా ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌న‌ప్ప‌టికీ వీరిద్ద‌రూ న‌టించ‌డం ప‌క్కా అంటున్నారు. ఇదిలా ఉండ‌గా ర‌జ‌నీకాంత్ , ఫహాద్ ఫాసిల్ వెట్టాయ‌న్ లో న‌టించారు.

Also Read : Beauty Sai Pallavi :మైత్రీ మూవీ మేక‌ర్స్ మూవీలో సాయి ప‌ల్ల‌వి

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com