ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఓటీటీలు రాజ్యమేలుతున్నాయి. జియో హాట్ స్టార్, ప్రైమ్ వీడియోస్, నెట్ ఫ్లిక్స్ , ఆహా, సన్ నెక్ట్స్ ..ఇలా చాలా ఉన్నాయి. వెబ్ సీరీస్ లు కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి. క్రైమ్, హార్రర్, కామెడీ, ఫ్యామిలీ, సెక్స్ ..రొమాన్స్ ఇలాంటి వాటిపై ఎక్కువగా దర్శకులు ఫోకస్ పెడుతున్నారు. ఇంకొన్ని ప్రేమ కథలను ఆధారంగా చేసుకుని చిత్రీకరిస్తున్నారు. ఇంకొన్ని ఇన్వెస్టిగేషన్ ఆధారంగా తయారు చేస్తున్నారు.
తాజాగా తెలుగులో జియో హాట్ స్టార్ లో వస్తోంది దేవికా అండ్ డానీ వెబ్ సీరీస్. ఇందులో ప్రముఖ హీరోయిన్ రీతు వర్మ కీ రోల్ పోషించింది. సూపర్ నేచురల్ థ్రిల్లర్ పార్ట్స్ లో ఇది పని చేస్తోంది. శ్రీకారం మూవీ ఫేమ్ బి. కిషోర్ ఈ తెలుగు వెబ్ సీరీస్ కు దర్శకత్వం వహించాడు. ఇందులో రీతు వర్మతో పాటు సూర్య వశిష్ట, శివ కందుకూరి, సుబ్బరాజ్ కీలక పాత్రలు పోషించారు.
రీతు వర్మ గతంలో వరుడు కావలెను అనే ఆహ్లాదకరమైన సినిమాలో నటించింది..ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది. ఇటీవలే సందీప్ కిషన్ తో కలిసి మరో మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇది మిశ్రమ స్పందన లభించింది. ఇక వెబ్ సీరీస్ విషయానికి వస్తే మ్యూజిక్ టీచర్ గా దేవిక పాత్రలో నటించింది రీతు వర్మ. జగ్గుతో నిశ్చితార్థం చేసుకుంటుంది. పెళ్లి కంటే ఇంకొకరిని ఇష్ట పడుతుంది. డానీ పాత్ర పోషించిన సూర్య వశిష్ట తన జీవితంలోకి అనుకోకుండా ప్రవేశిస్తాడు. మరింత ఆసక్తిని రేపుతాడు తనలో.
ఇంతకు తను ఎందుకు వచ్చాడు..దేవిక నిశ్చితార్థానికి ఏమి జరిగింది . అనేది తెలుసు కోవాలంటే ఈ వెబ్ సీరీస్ తప్పకుండా చూడాల్సిందే. మొత్తంగా దర్శకుడు ఇంటిల్లి పాది హాయిగా చూసేలా సీరీస్ ను తయారు చేశాడు. ఒక రకంగా ఫీల్ గుడ్ అనిపించేలా ఉంది. ఎలాంటి ద్వందర్థాలు లేకుండా ఉండేలా జాగ్రత్త పడ్డాడు. మొత్తంగా చూసేయొచ్చు ఎంచక్కా ఎంజాయ్ చేయొచ్చు .