బాలీవుడ్ లో అత్యంత జనాదరణ పొందిన నటుడు అమీర్ ఖాన్. తను ఎంచుకునే పాత్రలు భిన్నంగా ఉంటాయి. ప్రేక్షకులను కట్టి పడేసేలా ఉంటాయి. ఇంకొన్ని ఆలోచింప చేసేలా ఉంటాయి. ఇది తన ప్రత్యేకత. ఏజ్ పెరుగుతున్నా ఎక్కడా తగ్గడం లేదు ఈ హీరో. తను గతంలో నటించిన చిత్రం సితారే జమీన్ పర్. ఈ చిత్రం 2007లో వచ్చింది. ఒక రకంగా మాస్టర్ పీస్ అని చెప్పక తప్పదు. సూపర్ సక్సెస్ అయ్యింది. తాజాగా దీనికి సీక్వెల్ తీశాడు. జూన్ 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది ప్రపంచ వ్యాప్తంగా. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ కు విపరీతమైన స్పందన లభించింది.
సితారే జమీన్ పర్ చిత్రంలో అమీర్ ఖాన్ తో పాటు అందాల సుందరి జెనీలియా దేశ్ ముఖ్ నటించారు. ఈ ఇద్దరూ కలిసి తెర పై అద్భుతమైన నటనతో కట్టి పడేశారు. ఎప్పుడు వస్తుందా అన్న ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. మూవీ మేకర్స్ కీలక ప్రకటన చేశారు. జూన్ 20వ తేదీన సితారే జమీన్ పర్ రానుందని ప్రకటించారు. 2022లో అమీర్ ఖనా్ నటించిన లాల్ సింగ్ చద్దా వచ్చింది. దానికి మిశ్రమ స్పందన లభించింది. మూడేళ్ల గ్యాప్ తర్వాత బాలీవుడ్ హీరో నుంచి వస్తున్న చిత్రం సితారే జమీన్ పర్.
ఈ చిత్రంలో అమీర్ ఖాన్ , జెనీలియాతో పాటు అరూష్ దత్తా, గోపీ కృష్ణ వర్మ, వేదాంత్ శర్మ, ఆశిష్ పెండ్సే, రిషి షహాని, రిషబ్ జైన్, నమన్ మిశ్రా, ఆయుష్ భన్సాలీ, సంవిత్ దేశాయ్, సిమ్రాన్ మంగేష్కర్‌లను పరిచయం చేసే ఒక చిన్న క్లిప్ ఉంది. ఈసందర్భంగా జెనీలియా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సోషల్ మీడియాలో ఇలా రాసింది. ఇది అసాధారణమైన చిత్రం. ఇందులో ప్రతి సన్నివేశం ఆ తారను పోలి ఉంటుందని పేర్కొంది.
