ప్రముఖ తమిళ సినీ దర్శకుడు విక్రమ్ సుగుమారన్ సోమవారం గుండె పోటుతో మృతి చెందారు. ఆయన అకాల మరణంతో సినీ పరిశ్రమలో విషాదం అలుముకుంది. ఆయన వయసు కేవలం 47 ఏళ్లు మాత్రమే. మధ యానై కూట్టం అనేది ఆయన తొలి చిత్రం. ఇది అత్యంత జనాదరణ పొందింది. చిత్ర నిర్మాతకు కొత్త సినిమా తీసేందుకు స్క్రిప్ట్ చెప్పిన తర్వాత మధురై నుండి తిరిగి వస్తుండగా సుగుమారన్ కు ఛాతిలో తీవ్ర నొప్పి రావడంతో సమీప ఆస్పత్రిలో తరలించారు. అంతలోపే మార్గ మధ్యంలోనే దర్శకుడు ప్రాణాలు కోల్పోయారని, ఆయనను బతికించ లేక పోయామని పేర్కొన్నారు వైద్యులు.
ది వోర్టెక్స్ ఫేమ్ కతిర్ నటించిన 2013లో దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘మధ యానై కూట్టం’ ద్వారా సుగుమారన్ బాగా పేరు పొందారు. 1999 – 2000 మధ్య లెజెండరీ దర్శకుడు బాలు మహేంద్రకు సహాయకుడిగా తన సినీ జీవితాన్ని ప్రారంభించాడు. ఒక కఠినమైన గ్రామీణ నాటకం ‘మధ యానై కూట్టం’తో తన ముద్ర వేశాడు. ఆయన ఇటీవలి దర్శకత్వం వహించిన చిత్రం రావణ కొట్టం. ఇది 2023లో రిలీజ్ అయ్యింది. ఇందులో భాగ్యరాజ్ ప్రధాన పాత్రలో నటించాడు.
విక్రమ్ సుగుమారన్ ‘థెరం పోరం’ అనే కొత్త ప్రాజెక్ట్‌పై ఫోకస్ పెట్టాడు. అయితే ఇటీవలే మీడియా సాక్షిగా కీలక వ్యాఖ్యలు చేశారు సుగుమారన్. తాను చిత్ర పరిశ్రమలో కొందరి నుంచి మోసపోయానని వాపోయాడు. కానీ ఇందుకు తగిన ఆధారాలు తన వద్ద లేవన్నాడు. ఆయన మృతితో పలువురు తీవ్ర సంతాపం తెలిపారు. గొప్ప సామాజిక కోణం కలిగిన దర్శకుడు తను అని పేర్కొన్నారు.