AP Dhillon : ప్రముఖ పంజాబీ గాయకుడి ఇంటి పై కాల్పులు

మరోవైపు ఈ కాల్పుల ఘటనకు తామే బాధ్యులమని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది...

Hello Telugu - AP Dhillon

AP Dhillon : ప్ర‌ముఖ పంజాబీ గాయకుడు ఏపీ ధిల్లాన్(AP Dhillon) కెన‌డాలోని నివాసం వ‌ద్ద‌ దుండగులు కాల్పులకు తెగబడ్డారు. సెప్టెంబ‌ర్ 2న ఈ ఘ‌ట‌న జ‌ర‌గ‌గా రెండు నెల‌ల త‌ర్వాత ఇప్పుడు బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇందుకు సంబంధించిన వీడియోను వాంకోవర్ పోలీసులు శుక్రవారం (ఈ రోజు) విడుదల చేశారు. సెప్టెంబర్ 2వ తేదీన వాంకోవర్‌లోని ఏపీ ధిల్లాన్(AP Dhillon) నివాసంపై దుండగులు పలు రౌండ్లు కాల్పులు జరిపారు. అనంతరం ఆయన నివాసంలోని రెండు వాహనాలకు నిప్పంటించారు. అయితే ఈ కాల్పుల్లో గాయకుడు ఏపీ ధిల్లాన్‌కు ఎటువంటి గాయాలు కాకుండా సుర‌క్షితంగా బ‌య‌ట ప‌డ్డారు.

AP Dhillon…

మరోవైపు ఈ కాల్పుల ఘటనకు తామే బాధ్యులమని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది. ఈ కేసులో ప్రమేయం ఉందని భావిస్తున్న అభిజిత్ కింగ్రాను కెనడా పోలీసులు అంటారియోలో అరెస్ట్ చేశారు. అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నారని అతడిపై కేసు నమోదు చేశామని శుక్రవారం అభిజిత్ కింగ్రాను కోర్టులో హాజరు పరచనున్నామని కెనడా పోలీసులు వెల్లడించారు. ఇక ఇదే కేసులో భారతీయుడు విక్రమ్ శర్మ కోసం పోలీసులు అరెస్ట్ వారెంట్‌ను సైతం జారీ చేశారు. కానీ అతడి ఫొటో మాత్రం విడుదల చేయలేదు. అయితే దక్షిణాసియాకు చెందిన వ్యక్తి అంటూ శర్మ వివరాలను కెనడా పోలీసులు విడుదల చేశారు. ప్రస్తుతం అతడు భారత్‌లో ఉండి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

బాలీవుడ్ ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్ నటించిన ఓ వీడియోకు ఏపీ ధిల్లాన్ సంగీతం సమకూర్చాడు. అలాగే పంజాబీలో చాలా పాపులర్ అయిన పలు గీతాలకు సైతం దిల్లాన్ సంగీతం అందించారు. ఇంకో వైపు కెనడాలోని నగల వ్యాపారి నివాసంపై ఇటీవల కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన సైతం లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పనేనని పోలీసులు భావిస్తున్నారు. బిష్ణోయ్‌తో తనకు సంబంధం ఉందని గ్యాంగ్‌‌స్టర్ రోహిత్ గోదారా ఇప్పటికే చెప్పారు. అతడు సైతం ధిల్లాన్‌ను హత్య చేస్తానని సోషల్ మీడియాలో ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.

Also Read : Viswam OTT : సడన్ గా ఓటీటీలో సందడి చేస్తున్న గోపీచంద్ ‘విశ్వం ‘

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com