అమరావతి – రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని, కూటమి సర్కార్ పాలనా పరంగా ఫెయిల్ అయ్యిందని ధ్వజమెత్తారు మాజీ మంత్రి ఆర్కే రోజా సెల్వమణి. మహిళలను చంపేస్తుంటే సీఎం, డిప్యూటీ సీఎం, హోం మంత్రి కనీసం మాట్లాడటక పోవడం దారుణమన్నారు. మహిళ హోం మంత్రిగా ఉండి కూడా మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. హోంమంత్రి వంగలపూడి అనిత తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు.
చిన్న పాపను చంపేసి, పూడ్చేసినా ప్రభుత్వం పట్టించుకోక పోవడం దార/ణమన్నారు ఆర్కే రోజా సెల్వమణి. తన్మయ్ అనే గిరిజన అమ్మాయి కనిపించడంలేదని ఫిర్యాదు చేస్తే పట్టించు కోలేదని ధ్వజమెత్తారు. ఫిర్యాదును పట్టించుకోక పోవడం వల్లనే తన్మయ్ శవమై కనిపించిందన్నారు. మహిళల ప్రాణాలు తీయడం, మానాలు తీయడం ఎల్లోస్ కు అలవాటైందని సంచలన ఆరోపణలు చేశారు .
మహిళలకు అన్యాయం జరుగుతుంటే పవన్ కల్యాణ్ ఎందుకు మాట్లాడటం లేదంటూ ప్రశ్నించారు.
అక్రమ కేసుల నమోదు చేయడం, అరెస్టులకు పాల్పడడం కూటమి పాలనలో పరిపాటిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. తాము భయపడే ప్రసక్తి లేదన్నారు ఆర్కే రోజా సెల్వమణి. ఆరు గ్యారెంటీల పేరుతో జనాన్ని బురిడీ కొట్టించి పవర్ లోకి వచ్చిన కూటమి సర్కార్ అన్ని రంగాలలో ఘోరంగా వైఫల్యం చెందిందన్నారు.