హైదరాబాద్ – ఈ మధ్యన టాలీవుడ్ కు చెందిన కొందరు మితిమీరి ప్రవర్తిస్తున్నారు. ఇతరులకు ఆదర్శ ప్రాయంగా ఉండాల్సిన వాళ్లు గతి తప్పుతున్నారు. తాజాగా సింగర్ మంగ్లీ బర్త్ డే పార్టీ చివరకు కేసుల నమోదు దాకా వెళ్లింది. ఇక సినీ నటి కల్పిక వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఈ ముద్దుగుమ్మ గత మే నెల 29న హైదరాబాద్ లోని ప్రిజం పబ్ కు వెళ్లింది. అక్కడ హల్ చల్ చేసింది. తననే బిల్లు పే చేయమంటారా అంటూ రచ్చ రచ్చ చేసింది.
అంతే కాకుండా సిబ్బంది పట్ల ఓవర్ యాక్షన్ చేసింది. ఆపై అసభ్యకరంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్లేట్స్ విసిరి వేయడం, సిబ్బంది పట్ల బాడీ షేమింగ్ చేయడం, ఆపై బూతులు తిట్టడం చేసింది. దీంతో సదరు నటి కల్పికపై ప్రిజం యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇదే సమయంలో న్యూ సెన్స్ చేస్తున్న సమయంలో అక్కడికి చేరుకున్న పోలీసుల పట్ల కూడా నానా హంగామా చేసింది కల్పిక. దీంతో గచ్చిబౌలి పోలీసులు నటిపై కేసు నమోదు చేశారు. 324(4),352,351(2) బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారంగా కేసు ఫైల్ చేశారు.
ఈ కేసు కూడా బర్త్ డే కేస్ కావడం విశేషం. కల్పిక తన బర్త్ డే సందర్బంగా ప్రిజం పబ్ లో వేడుకలు చేసుకుంది. బయటి నుంచి తీసుకు వచ్చిన కేకును సిబ్బంది అనుమతించ లేదు. దీంతో కల్పికకు ప్రిజంకు మధ్య వాగ్వావాదం చోటు చేసుకుంది. దీని గురించి తనపై అసభ్యంగా ప్రవర్తించారంటూ ఇన్ స్టా లో పోస్ట్ చేసింది. ఇక ఈ కల్పిక ఆరేంజ్, జులాయి, సారొచ్చారు, పడి పడి లేచె మనసు, హిట్ ఫస్ట్ కేసు, యశోద, తదితర చిత్రాలలో నటించింది.