కృతీ సనన్ , టైగర్ ష్రాఫ్ కలిసి నటించిన గణపత్ చిత్రం ట్రైలర్ రిలీజ్ అయ్యింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ ట్రైలర్ అన్ని వర్గాలను ఆకట్టుకునేలా ఉంది. ప్రత్యేకించి టైగర్ ష్రాఫ్ స్టంట్స్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ కానుంది. ఇది యాక్షన్ , థ్రిల్లర్ గా తెరకెక్కించే ప్రయత్నం చేశాడు దర్శకుడు.
ఈ గణపథ్ లో బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా కీలక పాత్రలో నటిస్తుండడం విశేషం. అక్టోబర్ 20న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మూవీ మేకర్స్. ఈ చిత్రం హిందీ, తమిళం, తెలుగు, మలయాళం , కన్నడ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. తొలుత ట్రాక్ హమ్ ఆయే హైని ఆవిష్కరించారు.
దీనికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఇదిలా ఉండగా 2014లో అందాల ముద్దుగుమ్మ కృతీ సనన్ , టైగర్ ష్రాఫ్ కలిసి హీరో పంతి చిత్రంలో నటించారు. దాదాపు 9 ఏళ్ల గ్యాప్ తర్వాత కలిసి ముందుకు వస్తున్నారు. ఈ చిత్రానికి కథ, దర్శకత్వం వహించారు వికాస్ బహ్ల్ . వాషు భగ్నావి, వికాస్ బహ్ల్ , దీష్మిఖా దేశ్ ముఖ్ , జాకీ భగ్నావి గణపథ్ ను నిర్మించారు.
మొత్తంగా దసరా పండుగకు విడుదల కానుండడంతో భారీ నమ్మకాన్ని పెట్టుకున్నారు సక్సెస్ అవుతుందని మూవీ మేకర్స్.
