విశ్వక్ సేన్ , నోరా ఫతేహి, నేహా శెట్టి కలిసి నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీకి సంబంధించి అప్ డేట్ వచ్చింది. డిసెంబర్ లో ఈ సినిమా రిలీజ్ కానుంది. 1980లో ఏలూరు, గోదావరి తీర ప్రాంతాలలో గూండాలు, రాజకీయ నేతల మధ్య నెలకొన్న పరిస్థితులను ఆధారంగా తీసుకుని ఈ సినిమాను తెరకెక్కించే ప్రయత్నం చేశాడు దర్శకుడు, రచయిత కృష్ణ చైతన్య. ఈ సినిమాకు కథ, కర్మ తనే.
డిసెంబర్ 8వ తేదీన రిలీజ్ చేయాలని డేట్ ఫిక్స్ చేశారు మూవీ మేకర్స్. విశ్వక్ , నోరా, నేహాతో పాటు అంజలి, రత్నమాల, నాసర్ , సాయి కుమార్ , గోపరాజు రమణ కూడా ఇతర పాత్రల్లో నటించారు. దసరా పండుగ సందర్బంగా పలు సినిమాలు రిలీజ్ కానున్నాయి.
మరికొన్ని సినిమాలు డిసెంబర్ లో విడుదలకు సిద్దంగా ఉన్నాయి. ఇదే సమయంలో ప్రభాస్ నటించిన సలార్ కూడా రాబోతోంది. దీంతో ఆ మూవీ రిలీజ్ తర్వాతే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిని విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఇక చిత్రానికి సంబంధించిన పోస్టర్స్, సాంగ్ ఆకట్టుకున్నాయి.
ఇదే డిసెంబర్ లో శౌర్యువ్ దర్శకత్వం వహించిన నాని, మృణాల్ ఠాకూర్ నటించిన హాయ్ నాన్న చిత్రం రిలీజ్ కానుంది. విశ్వక్ సేన్ ఈ సినిమాపై భారీ నమ్మకం పెట్టుకున్నాడు.