హైదరాబాద్ – అక్కినేని నాగార్జున తనయుడు, రెండో భార్య అమల కొడుకు అఖిల్ అక్కినేని పెళ్లి ఘనంగా జరిగింది నిన్న జూబ్లీ హిల్స్ లోని తన నివాసంలో. ఆదివారం నగరంలోని అన్నపూర్ణ స్టూడియోస్ లో అంగరంగ వైభోపేతంగా రిసెప్షన్ వేడుక కొనసాగింది. ఈ వేడుకకు భారీ ఎత్తున తరలి వచ్చారు ప్రముఖులు. విస్తృతంగా ఏర్పాట్లు చేశారు నటుడు అక్కినేని నాగార్జున. ఇదిలా ఉండగా గత కొంత కాలంగా ప్రేమలో మునిగి తేలారు అఖిల్ అక్కినేని, రవిడ్జీ.
ఈ కార్యక్రమానికి సినీ, క్రీడా, రాజకీయ , వ్యాపార, వాణిజ్య రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యరు. ప్రిన్స్ మహేష్ బాబు తన ఫ్యామిలీతో హాజరయ్యారు. వీరు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. సినీ దర్శకులు ప్రశాంత్ నీల్ , ఎస్ఎస్ రాజమౌళి, సుకుమార్, నటీ నటులు మెగాస్టార్ చిరంజీవి, సురేఖ, రామ్ చరణ్, ఉపాసన, అల్లు అర్జున్ , స్నేహా రెడ్డితో పాటు నిర్మాతలు దిల్ రాజు, అల్లు అరవింద్ హాజరయ్యారు.
తమిళ సినీ రంగం నుంచి సూర్య , జ్యోతిక కూడా ప్రధాన ఆకర్షణగా నిలిచారు. వీరు నూతన వధూవరులను ఆశీర్వదించారు. జీవితాంతం చల్లగా ఉండాలని దీవించారు.