Google : ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ కీలక మార్పులు చేసింది. తాజాగా తన సంస్థకు సంబంధించిన గూగుల్ లోగోను మార్చేసింది. మరింత ఆకర్షణీయంగా ఉండేలా తీర్చిదిద్దింది. 10 ఏళ్ల తర్వాత గూగుల్ లోగోను మార్చడం మరింత ఆసక్తిని రేపింది. టెక్నాలజీ పరంగా ఎన్నో మార్పులు చేసుకున్నా గూగుల్ మాత్రం తన ప్రాధాన్యతను కోల్పోలేదు. అంతకంతకూ ఆదరణ చూరగొంటోంది. ఇటీవల వచ్చిన చాట్ జీపీటీ, ఎక్స్ గ్రో కు ధీటుగా గూగుల్ సైతం జెమిని ఏఐని తీసుకు వచ్చింది.
Google New Logo
తాజాగా గూగుల్(Google) కంపెనీ లోగోను మార్చడం పట్ల టెక్ ప్రేమికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏ కంపెనీ అయినా ఆదరణ పొందాలన్నా, ఆకట్టు కోవాలన్నా ముందు కావాల్సింది లోగో. అది ఎంతగా అందంగా ఉంటే, ఆకర్షణీయంగా ఉంటే దాని పట్ల వినియోగదారులు ఇష్ట పడతారు. అందుకే ప్రపంచంలో టాప్ కంపెనీలన్నీ భారీ ఎత్తున ఖర్చు చేస్తాయి. అంచనాలకు మించి ఉండేలా జాగ్రత్త పడతాయి. ప్రతి లోగో వెనుక చాలా శ్రమ ఉంటుంది.
కొన్నేళ్లకు ముందు గూగుల్ తన లోగోను తయారు చేసింది. ఆ తర్వాత ఇప్పుడు మార్పులు చేయడం. కొన్ని కలర్స్ ను అదనంగా చేర్చింది. గూగుల్ తన ఐకానిక్ ‘G’ లోగోను కొత్త గ్రేడియంట్ డిజైన్తో నిశ్శబ్దంగా అప్డేట్ చేసింది, ఇందులో నాలుగు రకాల కలర్స్ ఇమిడి ఉన్నాయి. సూపర్ గా ఉండేలా తీర్చి దిద్దారు గూగుల్ లోగోను.
Also Read : Samantha Shocking :రాజ్ తో బంధం సమంత సంతోషం
