టాలీవుడ్ లో మినిమం గ్యారెంటీ ఉన్న దర్శకుల్లో మొదటగా గుర్తుకు వచ్చేది శ్రీను వైట్ల. మనోడి మూవీస్ అన్నీ కామెడీ ప్రధానంగా ఉంటాయి. తాజాగా గోపీచంద్ తో కొత్తగా సినిమా స్టార్ట్ చేశాడు. చాలా గ్యాప్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. కథ, మాటలకు ఎక్కువగా ప్రయారిటీ ఇస్తాడు దర్శకుడు.
ఇంటిల్లిపాది హాయిగా నవ్వుకునేలా ఉండాలని భావిస్తాడు. దీంతో వీరిద్దరి కాంబినేషన్ లో రాబోయే చిత్రం ఎలా ఉంటుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. తాజాగా మూవీ మేకర్స్ కీలక అప్ డేట్ ఇచ్చారు. ఇంకా పేరు పెట్టని గోపిచంద్ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతోంది.
ప్రస్తుతం షెడ్యూల్ లో భాగంగా ఇటలీలో కొన్ని సన్నివేశాలతో పాటు ఓ సాంగ్ షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి. ఇదిలా ఉండగా గోపిచంద్ 32కు విశ్వం అని పేరు ఖరారు చేసినట్టు టాక్. కాగా కావ్య థాపర్ గోపీచంద్ సరసన నటించనుంది.
ఇంకో పాత్రలో కావ్య కళ్యాణ్ రామ్ ను తీసుకుంటున్నట్లు టాలీవుడ్ లో తెగ ప్రచారం జరుగుతోంది.