కొంద‌రి వ‌ల్లే గోవింద‌కు తీవ్ర న‌ష్టం

అందుకే ఛాన్స్ లు రావ‌డం లేదు

బాలీవుడ్ స్టార్ హీరో గోవింద గురించి ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు త‌న భార్య సునీతా అహూజా. వీరు కొంత కాలంగా అన్యోన్యంగా ఉన్నారు. ఆ మ‌ధ్య‌న విడిపోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇద్ద‌రికి పెళ్లి అయి 38 ఏళ్ల‌వుతోంది. తమ మ‌ధ్య ఎలాంటి విభేదాలు లేనే లేవంటూ స్ప‌ష్టం చేసింది సునీతా మేనేజ‌ర్. ఈ సంద‌ర్బంగా విడాకుల వార్త‌లు పూర్తిగా అబ‌ద్ద‌మంటూ పేర్కొన్నారు సునీతా మేనేజ‌ర్ సాదియా సోల్క‌ర్. ఇది నిజం కాద‌న్నారు. ఈ పుకార్ల‌పై ఆమె మ‌రింత వ్యాఖ్యానించేందుకు ఒప్పుకోలేదు.

ఎవ‌రికి వారు త‌మ‌కు తోచిన రీతిలో అభిప్రాయాల‌ను పంచుకోవ‌డం స‌హ‌జ‌మేన‌ని పేర్కొన్నారు. పుకార్లు షికార్లు చేయ‌డం ష‌రా మామూలేన‌ని వెల్ల‌డించారు. దీనిపై గోవింద మేన‌కోడ‌లు, మేన‌ల్లుడు ఆర్తీ సింగ్, కృష్ణ అభిషేక్ పూర్తిగా ఖండించారు. వీటిని నిరాధార‌మైన‌విగా పేర్కొన్నారు. తాజాగా సునీతా అహూజా స్పందించారు. ఇవాళ చిట్ చాట్ సంద‌ర్బంగా మాట్లాడుతూ గోవింద కెరీర్ నాశ‌నం కావ‌డానికి త‌ను చుట్టూ ఉన్న కొంద‌రేన‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

ఇదిలా ఉండ‌గా గోవిందా, సునీతా ఆహూజాది పెద్ద‌లు కుదిర్చిన పెళ్లి కాదు. ప్రేమ వివాహం. కొంత కాలంపాటు ప్రేమ‌లో ప‌డ్డారు. బాలీవుడ్ లో స్టార్ డ‌మ్ కి ఎదిగేందుకు ముందే వీరి మ‌ధ్య ల‌వ్ నెల‌కొంది.
సునీత 9వ తరగతిలో ఉన్నప్పుడు గోవిందను మొదటిసారి ఒక వివాహంలో కలిసింది. గోవిందను బాలీవుడ్‌లో పరిచయం చేసిన అతని మామకు సునీత వదిన కావడంతో వారి మధ్య కుటుంబ సంబంధం ఉంది.

కాగా గోవింద‌, సునీతా ఆహూజాల మ‌ధ్య ప్రేమ సంవత్సరాల తర్వాత వికసించింది. వారిద్దరూ 38 సంవత్సరాలుగా వివాహం చేసుకున్నారు . వీరికి టీనా అహుజా, యశ్వర్ధన్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com