టాలీవుడ్ లో ప్రిన్స్ మహేష్ బాబుకు ఉన్న మేనియా మామూలుగా ఉండదు. మనోడికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పరుశురామ్ తో సర్కారువారి పాట సూపర్ సక్సెస్ అయ్యింది. తాజాగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో గుంటూరు కారం చేస్తున్నాడు.
మొదట పూజా హెగ్డేను అనుకున్నారు. కానీ ఏమైందో ఏమో కానీ శ్రీలీల, మీనాక్షి చౌదరిని తీసుకున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించి షూటింగ్ శర వేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే కీలక సన్నివేశాలు పూర్తయినట్లు సమాచారం.
ఫైట్ మాస్టర్స్ ఫైట్ సీన్స్ తీసినట్లు టాక్. గుంటూరు కారం సినిమా షూటింగ్ లో మంగళవారం మహేష్ బాబు హాజరు కానున్నారని మహేష్ బాబు ట్రెండ్స్ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. ఇక ఇప్పటి వరకు మూడు రోజుల పాటు కోఠి లోని ఉమెన్స్ కాలేజీలో షూటింగ్ పూర్తి చేశారు.
ఇదిలా ఉండగా ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి పెద్ద ఎత్తున రూమర్స్ వచ్చాయి. తొలుత షూటింగ్ ప్రారంభ సమయంలో లవ్లీ బ్యూటీ పూజా హెగ్డేను సెలెక్ట్ చేశారు. కానీ తర్వాత తొలగించారు. మహేష్ బాబు తో పడక వెళ్లి పోయినట్లు టాక్.
మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ థమన్ కూడా మారాడు. ఆయన స్థానంలో అనిరుధ్ ను తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. మొత్తంగా గుంటూరు కారం సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రానుంది. ఈ విషయాన్ని ప్రిన్స్ చెప్పారు.