ఎట్టకేలకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరి హర వీరమల్లు మూవీకి సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. ఇప్పటి దాకా వాయిదా వేస్తూ వచ్చిన చిత్రం విడుదల తేదీని ఖరారు చేసింది. ఈ మేరకు జూన్ 12న రానున్నట్లు ప్రకటించారు మూవీ మేకర్స్. ఎక్స్ వేదికగా వెల్లడించింది. ప్రముఖ నిర్మాత ఎంఎం రత్నం ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇందులో పవన్ కళ్యాణ్ తో పాటు మరో పాత్రను పోషిస్తున్నారు అందాల ముద్దుగుమ్మలు. నిధి అగర్వాల్ , మాళవికా మోహన్.
ఈ సినిమా ప్రారంభం నుంచి పడుతూ లేస్తూ వచ్చింది. మొదట దీనికి దర్శకత్వం వహించారు జాగర్లమూడి క్రిష్. మధ్యలోనే నిష్క్రమించారు. తన తొలి భార్యకు విడాకులు ఇచ్చాడు. డాక్టర్ ను రెండో పెళ్లి చేసుకుని వెళ్లి పోయాడు. ఈ సమయంలో మరో దర్శకుడు ఎంట్రీ ఇచ్చాడు. సినిమాను పూర్తి చేసేందుకు నానా తంటాలు పడ్డాడు.
తాజాగా సినిమాకు సంబంధించి పోస్టర్స్ , టీజర్ , సాంగ్స్ కు మంచి స్పందన లభించింది. సంగీతం ఎంఎం కీరవాణి హరి హర వీరమల్లకు అందించారు. ఇందులో స్పెషాలిటీ ఏమిటంటే పవన్ కళ్యాణ్ తో సాంగ్ పాడించారు. ఇది కూడా వైరల్ గా మారింది. ఈసారైనా సినిమా వస్తుందా అన్నది ఇంకా అనుమానంగా ఉంది.