ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య పాత్ర పోషించిన చిత్రం హరి హర వీరమల్లు. ఈ సినిమాకు సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా నిర్మాత ఎంఎం రత్నం కీలక ప్రకటన చేశారు. జూలై 3వ తేదీన సినిమా ట్రైలర్ విడుదల కానుందని తెలిపారు. అంతే కాకుండా జూలై 24న హరి హర వీరమల్లును ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తామన్నారు.
మొదటగా ఈ చిత్రాన్ని జాగర్లమూడి క్రిష్ దర్శకత్వం వహించాడు. ఏమైందో ఏమో కానీ ఉన్నట్టుండి వదిలేసి పోయాడు. ఈ సమయంలో గత్యంతరం లేక నిర్మాత ఎంఎం రత్నం తన సోదరుడు తనయుడు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించాడు. దీనికి సంగీతం అందించాడు ఎంఎం కీరవాణి. పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ నటించింది.
ఈ సినిమా కథ 17వ శతాబ్దానికి సంబంధించిన వీరమల్లు కథ. దీనిని చారిత్రిక నేపథ్యంలో తీసేందుకు ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నాడు నిర్మాత. కానీ వర్కవుట్ అవుతుందా లేదా అన్నది తేలాల్సి ఉంది. ఇప్పటికే తాను రెమ్యునరేషన్ కింద తీసుకున్న రూ. 11 కోట్లను తిరిగి రత్నంకు ఇచ్చేశాడు. దీంతో సినిమాపై అంచనాలు అంతగా లేకుండా పోయాయి.