ప్రపంచ క్రికెట్ లో ఇద్దరు దిగ్గజ క్రికెటర్లుగా గుర్తింపు పొందిన స్టార్ ప్లేయర్లు గ్లెన్ మ్యాక్స్ వెల్ వన్డే ఫార్మాట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించగా ఇదే సమయంలో తాను కూడా గుడ్ బై చెప్పేస్తున్నట్లు వెల్లడించి అందరినీ ఆశ్చర్య పోయేలా చేశాడు సౌతాఫ్రికా క్రికెటర్ హెన్రిచ్ క్లాసెన్. తను దక్షిణాఫ్రికా సాధించిన విజయాలలో భాగం పంచుకున్నాడు. కీలక పాత్ర పోషించాడు. తన వయసు 33 ఏళ్లు. సౌతాఫ్రికా తరపున 4 టెస్టులు, 60 వన్డేలు, 58 టి20 మ్యాచ్ లు ఆడాడడు. 2,764 రన్స్ చేశాడు.
ఈ ఏడాది మార్చిలో ముగిసిస ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా కీవీస్ తో జరిగిన సెమీస్ మ్యాచ్ తనకు చివరిది. తను ఎక్కువగా మ్యాచ్ లలో మిడిల్ ఆర్డర్ లో వచ్చాడు. వీర బాదుడు బాదడంలో తనకు తనే సాటి. 2023లో జరిగిన వన్డే వరల్డ్ కప్ తో పాటు 2024లో జరిగిన టి20 వరల్డ్ కప్ లో దక్షిణాఫ్రికా జట్టు గెలుపులో కీ రోల్ పోషించాడు. ఈ సందర్బంగా తన వ్యక్తిగత ఇన్ స్టా స్టోరీస్ లో తప్పుకుంటున్నట్లు స్పష్టం చేశాడు. తన జీవితంలో అత్యంత బాధాకరమైన రోజుగా పేర్కొన్నాడు. తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు హెన్రిచ్ క్లాసెన్.
కుటంబ జీవితంపై దృష్టి సారించేందుకే తాను ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నాడు. తనపై అద్బుతమైన రికార్డులు నమోదై ఉన్నాయి. తన దేశం తరపున అత్యుత్తమ వైట్ బాల్ బ్యాటర్లలో ఒకడిగా గుర్తింపు పొందాడు. ఆట పరంగా తాను ఫ్యామిలీతో గడప లేక పోయానని వాపోయాడు.
