కార్తికేయ మూవీ ఫేమ్ హీరో నిఖిల్ కీలక వ్యాఖ్యలు చేశారు. తను నటిస్తున్న చిత్రానికి సంబంధించి హైదరాబాద్ లో చిత్రీకరణ జరుగుతోంది. ఈ సందర్బంగా వరద సీన్ కోసం సెట్టింగ్ వేశారు. అనుకోకుండా అది తెగింది. దీంతో షూటింగ్ సమయంలో ఉన్న సిబ్బందిలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన కలకలం రేపింది. దీనిపై గురువారం స్పందించారు నటుడు నిఖిల్.
అందరం సురక్షితంగానే ఉన్నామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదన్నాడు. ప్రమాద సమయంలో షూటింగ్ స్పాట్‌లోనే ఉన్నట్లు వెల్లడించాడు. షాట్ బ్రేక్‌లో పక్కకు వెళ్లడంతో నిఖిల్‌కి ముప్పు తప్పిందన్నాడు సినిమా నిర్మాత అభిషేక్ అగర్వాల్. ప్రమాదం కారణంగా కెమెరా అసిస్టెంట్‌తో పాటు మరో ఇద్దరికి గాయాలు అయినట్లు తెలిపాడు. వారిద్దరిని హుటా హుటిన ఆస్పత్రికి తరలించామని, చికిత్స కొనసాగుతోందన్నాడు నిర్మాత.
ఇదిలా ఉండగా నిఖిల్ కు మంచి పేరు తీసుకు వచ్చేలా చేసింది దేశ వ్యాప్తంగా కార్తికేయ చిత్రం. ఎవరూ ఊహించని రీతిలో ఈ మూవీకి స్పందన లభించింది. ఆశించిన దానికంటే బిగ్ హిట్ కావడంతో నటుడికి పెద్ద ఎత్తున సినిమాలలో నటించేందుకు ఆఫర్స్ వస్తున్నాయి. తాజాగా ఓ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్న సందర్బంగా ఈ ఘటన చోటు చేసుకుంది. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు తెగ వైరల్ అయ్యాయి. దీంతో గత్యంతరం లేక స్పందించాడు నిర్మాత, నటుడు.