Hero Nithin: ప్రేక్షకులకు నితిన్ బంపర్ ఆఫర్… షాక్ లో నిర్మాత నాగవంశీ

ప్రేక్షకులకు నితిన్ బంపర్ ఆఫర్... షాక్ లో నిర్మాత నాగవంశీ

Hello Telugu - Hero Nithin

Hero Nithin: యువ దర్శకుడు వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్, శ్రీలీల జంటగా… యాంగ్రీ యంగ్ మన్ రాజశేఖర్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఎ క్స్‌ట్రా – ఆర్డినరీ మేన్‌’. నితిన్ హోం బ్యానర్‌ శ్రేష్ఠ్‌ మూవీస్‌పై సుధాకర్‌ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి హరీష్ జయరాజ్ సంగీతం అందిస్తున్నారు.

Hero Nithin Offers

డిసెంబరు 8న విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమాకు సంబందించిన ‘ఒలే ఒలే పాపాయి.. పలాసకే వచ్చేయి’ అనే పాట ప్రోమోను ఇటీవల చిత్ర యూనిట్ విడుదల చేసింది. హైదరాబాద్ వేదికగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో హీరో నితిన్… ప్రేక్షకులకు ఇచ్చిన ఆఫర్… ఈ సినిమా నిర్మాత సూర్యదేవర నాగవంశీకు షాక్ ఇచ్చింది. దీనితో నితిన్ వ్యాఖ్యలతో పాటు… నిర్మాత నాగవంశీ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.

సినిమా చూసి ఒక్కసారైనా నవ్వకపోతే టిక్కెట్టు డబ్బులు నిర్మాత వెనక్కి ఇస్తారంటూ నితిన్ వ్యాఖ్యలు

‘ఎక్స్‌ట్రా: ఆర్డినరీమ్యాన్‌’ పాట విడుదల సందర్భంగా మీడియాతో మాట్లాడిన హీరో నితిన్… ‘ఈ సినిమా చూస్తున్నప్పుడు మీరంతా కడుపుబ్బా నవ్వకపోతే.. మీ డబ్బులు నిర్మాత నాగవంశీ వెనక్కి ఇస్తారు. మా మధ్య చాలా లావాదేవీలు ఉన్నాయి’’ అని అన్నారు.

అయితే ఈ కార్యక్రమంలో నిర్మాత నాగవంశీ లేకపోవడంతో… తరువాత దీనిపై సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ… ‘‘ఆరోజు ‘మ్యాడ్‌’ వైబ్‌లో అలా అనేశాం. నితిన్‌(Nithin).. మీరు ఇలా లాక్‌ చేస్తే ఎలా?’’ అంటూ ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం జిఫ్‌ ఫొటోను దానికి ట్యాగ్ చేసారు. ప్రస్తుతం నితిన్ వ్యాఖ్యలు, నాగవంశీ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి

‘మ్యాడ్‌’ సినిమాకు ఇదే ఆఫర్ ను ప్రకటించిన నిర్మాత నాగవంశీ

కొన్ని రోజుల క్రితం ‘మ్యాడ్‌’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా.. ‘‘జాతిరత్నాలు’ సినిమాకంటే ఒక్కసారైనా తక్కువ నవ్వితే ప్రేక్షకులు కొన్న టికెట్‌ డబ్బులు తిరిగి ఇచ్చేస్తా’’ అని నాగవంశీ ప్రకటించారు. అయితే జాతిరత్నాలు అంత హిట్ కాకపోయినప్పటికీ ‘మ్యాడ్‌’ సినిమా పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. సినిమాలో కామెడీకు మంచి రెస్పాన్స్ రావడంతో నిర్మాత నాగవంశీ వ్యాఖ్యలను నెటిజన్లు పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు.

Also Read : King Nagarjuna: నాగచైతన్య యాక్టింగ్ కు నాగార్జున ఫిదా

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com