Vishal : చెన్నై – ప్రముఖ తమిళ సినీ నటుడు విశాల్ ఆస్పత్రి పాలయ్యారు. ఆయన అస్వస్థతకు గురి కావడంతో హుటా హుటిన చికిత్స నిమిత్తం తరలించారు. విల్లు పురంలోని ఓ వేదికపై ఉండగా స్పృహ తప్పి పడి పోయారు. ఇదిలా ఉండగా గత కొంత కాలం నుంచి తను తీవ్రమైన వ్యాధితో బాధ పడుతున్నట్లు జోరుగా ప్రచారం జరిగింది. ఇటీవలే తను నటించిన చిత్రం విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
Hero Vishal Health Updates
కొంత కాలం నుంచి ఎక్కువగా బయటకు రావడం లేదు. తన ఆరోగ్యం గురించి ఆందోళన చెందవద్దని తాను బాగానే ఉన్నానంటూ తన అభిమానులను ఉద్దేశించి పేర్కొన్నారు. తన ఆరోగ్యం ప్రస్తుతం కుదట పడిందని, ఎవరూ బాధ పడవద్దని, తన కోసం ప్రార్థనలు చేయొద్దంటూ కోరాడు నటుడు విశాల్(Vishal). ఇక సినీ రంగంలో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ ను స్వంతం చేసుకున్నాడు.
తను నటుడు శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి శరత్ కుమార్ తో కొంత కాలం డేటింగ్ జరిపినట్లు జోరుగా ప్రచారం జరిగింది. ఆ తర్వాత దానిని ఖండించాడు. తాము ఇద్దరం మంచి స్నేహితులం మాత్రమేనని పేర్కొన్నాడు. ఈ మధ్యనే అంజలి, వరలక్ష్మి శరత్ కుమార్ తో కలిసి ఫుల్ లెంగ్త్ కామెడీతో మూవీ తీశాడు. ఇందులో తను కీ రోల్ పోషించాడు విశాల్. ఈ ఏడాది విడుదలైన ఈ చిత్రం మంచి ఆదరణ పొందింది. ఇదిలా ఉండగా తను ఆస్పత్రి పాలైన విషయం తెలుసుకున్న అభిమానులు ఆస్పత్రి వద్దకు చేరుకుంటున్నారు.
Also Read : INDW vs SLW Sensational : ట్రై సీరీస్ భారత్ మహిళలు కైవసం