Hero Yash: ‘కేజీఎఫ్’ హీరో యశ్… కొత్త సినిమా ‘టాక్సిక్‌’

'కేజీఎఫ్' హీరో యశ్... కొత్త సినిమా ‘టాక్సిక్‌’

Hello Telugu - Hero Yash

Hero Yash: ‘కేజీఎఫ్’ సిరీస్ తో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న కన్నడ నటుడు యశ్… కొత్త సినిమా అప్ డేట్ ఎట్టకేలకు వచ్చింది. ‘కేజీఎఫ్ ఛాప్టర్ 2’ తరువాత దర్శకుడు ప్రశాంత్ నీల్… గ్యాప్ లేకుండా ‘సలార్‌ పార్ట్‌ 1: ది సీజ్‌ ఫైర్‌’ తెరకెక్కిస్తున్నప్పటికీ హీరో యశ్(Hero Yash) మాత్రం గ్యాప్ తీసుకున్నారు. ఈ నేపథ్యంలో తన 19వ సినిమాకు సంబంధించిన కీలక అప్ డేట్స్ ను ఓ వీడియో రూపంలో శుక్రవారం విడుదల చేసారు. ప్రస్తుతం యశ్ కొత్త సినిమా అప్ డేట్స్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ మారుతున్నాయి.

Hero Yash – యశ్‌ 19వ సినిమాగా ‘టాక్సిక్‌’

ప్రముఖ మలయాళ దర్శకురాలు గీతూ మోహన్‌దాస్‌ దర్శకత్వంలో యశ్ తన 19వ సినిమాను చేస్తున్నట్లు ప్రకటించారు. 2025 ఏప్రిల్ 10న విడుదల చేయున్న ఈ సినిమాకు ‘టాక్సిక్‌’ అనే టైటిల్ ను కూడా ఖరారు చేసారు. ఈ టైటిల్ కు ‘నువ్వు వెతుకుతున్నది.. నిన్ను కోరుకుంటోంది’ అనే క్యాప్షన్‌ కూడా రాశారు. మాదకద్రవ్యాల సరఫరా ఇతివృత్తంతో అత్యంత భారీ బడ్జెట్ తో యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాలో సాయి పల్లవిని హీరోగా ఎంపిక చేసినట్లు వార్తలు వినిపించినప్పటికీ… శుక్రవారం విడుదల చేసిన వివరాల్లో హీరోయిన్ గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. ‘కేజీఎఫ్‌’ వంటి భారీ హిట్‌ ప్రాజెక్ట్‌ తర్వాత యశ్‌ నటిస్తోన్న సినిమా కావడంతో దీనిపై అందరిలో ఆసక్తి ఏర్పడింది. అందరూ గర్వపడేలా తన నెక్స్ట్ సినిమా ఉంటుందని గతంలో యశ్‌ తెలియజేయడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి.

Also Read : Allu Arjun: ‘యానిమల్’ ను ఆకాశానికి ఎత్తేస్తున్న అల్లు అర్జున్

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com