ఏ ముహూర్తంలో దర్శకుడు ప్రశాంత్ నీల్ తనను తీసుకున్నాడో ఆనాటి నుంచి మంచి ఆఫర్స్ వస్తున్నాయి శాండిల్ వుడ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి. తను కేజీఎఫ్ లో తళుక్కున మెరిసింది. ఇప్పుడు తాజాగా వైరల్ గా మారింది. నేచురల్ స్టార్ నానితో కలిసి శైలేష్ కొలను తీసిన హిట్ 3 మూవీలో కీ రోల్ పోషించింది. ఇది ఊహించని సక్సెస్ గా నిలిచింది. దీంతో సక్సెస్ మీట్ లో తన అనుభూతిని పంచుకుంది లవ్లీ బ్యూటీ.
తను మోడల్ నుండి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. టాలీవుడ్ లో తన గురించి ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. నటనతో పాటు అందంగా ఉండడంతో ప్లస్ పాయింట్ అయ్యింది. ఇప్పుడు హిట్ 3 హిట్ కావడంతో అనూహ్యంగా ఛాన్స్ లు వస్తున్నాయి సినిమాలలో నటించేందుకు . దీంతో ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు జోష్ లో ఉంది. తను ఊహించలేదని ఈ చిత్రం విజయవంతం అవుతుందని పేర్కొంది.
తాజాగా శ్రీనిధి శెట్టి గురించి కీలక అప్ డేట్ వచ్చింది. ప్రముఖ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ నటిస్తున్న కొత్త చిత్రం తెలుసు మూవీలో మహిళా ప్రధాన పాత్ర పోషించేందుకు ఎంపికైంది. నానితో నటించడం, సిద్దూతో తెర పంచుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేసింది. ఇది తనకు మరింత సంతోషాన్ని కలిగించేలా చేసిందని తెలిపింది. ఏది ఏమైనా శ్రీనిధి శెట్టికి ఈ ఏడాది శుభారంభం , ఆనందం మిగిలించిందని చెప్పక తప్పదు.
