Honey Singh: విడాకులు తీసుకున్న స్టార్ సింగర్

బాలీవుడ్ ర్యాప్ సింగర్ హనీసింగ్ తన భార్య షాలిని తల్వార్ తో విడాకులు

Hellotelugu-Honey Singh

విడాకులు తీసుకున్న స్టార్ సింగర్

Honey Singh : తమ 12 ఏళ్ళ వివాహా బంధానికి ముగింపు పలికారు ప్రముఖ ర్యాప్ సింగర్ హనీసింగ్ మరియు అతని భార్య షాలిని తల్వార్. 2011 జనవరి 23 న పెళ్లి చేసుకున్న హనీసింగ్-షాలిని తల్వార్ పెళ్ళైన కొన్నేళ్ళకే ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. ఇరువురి మధ్యన సరైన సాన్నిహిత్యం, అవగాహన లేకపోవడం మరియు వివాహేత సంబంధాల కారణంగా అతి తక్కువ వయసులోనే మనస్పర్ధలు తలెత్తాయి. దీనితో హనీసింగ్(Honey Singh) తనను మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురిచేయడమేకాకుండా, ఇతర మహిళలతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడంటూ 2021లో షాలిని ఢిల్లీలోని తీస్ హజార్ కోర్టులో ‘గృహహింస చట్టం క్రింద పిటీషన్ దాఖలు చేసింది.

కొంతకాలానికే ఇద్దరు విడాకుల కోసం కోర్టులో ధరఖాస్తు చేసుకున్నారు. విడాకుల సమయంలో షాలిని 10 కోట్ల రూపాయలకు భరణంగా డిమాండ్ చేసినప్పటికీ పలు చర్చల అనంతరం కోటి రూపాయల భరణానికి అంగీకరించింది. దీనితో వీరి ఇరువురి విడాకులకు కోర్టు అంగీకరించగా… మంగళవారం పూర్తి స్థాయి ఉత్తర్వులు జారీచేయడంతో 12 సంవత్సరాల వివాహ బంధానికి తెరపడింది. ఈ విడాకులు ఫోర్స్ లోకి రావడంతో ఇకపై ఎవరి వ్యక్తిగత జీవితాలను వారు లీడ్ చేయనున్నారు. అయితే ప్రేమించి పెళ్ళలి చేసుకున్నా లేదా పెద్దలు కుదిర్చిన పెళ్లి అయినా సరే సెలబ్రిటీలు ఎక్కువ కాలం కలిసి బ్రతకడంలో విఫలం అవుతున్నారు అనే వాదన బలంగా వినిపిస్తోంది.

Honey Singh- పదేళ్ళ ప్రేమయాణం తరువాత 2011లో ఒక్కటైన హనీసింగ్-షాలినీ తల్వార్

దేశి కేల్కర్, సన్నీ సన్నీ , బ్లూ ఐస్ లాంటి పాటలతో బాగా పాపులర్ అయిన హనీసింగ్… షాలిని తల్వార్ తో పదేళ్ళ పాటు ప్రేమాయణం నడిపి చివరకు 2011 జనవరి 23 న పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్ళైన కొన్నేళ్ళకే వీరి వివాహ బంధంలో విభేధాలు తలెత్తి… అతి తక్కువ వయసులో విడాకులు తీసుకున్న బాలీవుడ్ సెలబ్రిటీలుగా మారారు.

Also Read : Ananya Nagalla : అన‌న్య అందాలు అద‌ర‌హో

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com