పాన్ ఇండియా మూవీగా విడుదలైంది హౌస్ ఫుల్. ఇందులో కీ రోల్ పోషించాడు అక్షయ్ కుమార్. చాలా గ్యాప్ తర్వాత వచ్చిన ఈ చిత్రం ఆశించిన దానికంటే ఎక్కువగా కలెక్షన్స్ సాధించింది. ఈ సినిమాతో కమల్ హాసన్, సిలాంబరసన్ , త్రిష కృష్ణన్ కలిసి నటించిన థగ్ లైఫ్ పోటీ పడినా చివరకు తేలి పోయింది. ఈ మూవీకి మిశ్రమ స్పందన లభించింది. గతంలో హౌస్ ఫుల్ రిలీజ్ అయ్యింది. దీనికి కొనసాగింపుగా హౌస్ ఫుల్ -5 వచ్చింది. ప్రేక్షకులు పెద్ద ఎత్తున ఆదరిస్తున్నారు. ఇది ఒక రకంగా బాలీవుడ్ పరంగా చూస్తే శుభ పరిణామమేనని చెప్పక తప్పదు.
సినీ విమర్శకుల నుంచి ప్రతికూల విమర్శలు పెద్ద ఎత్తున వచ్చినా తట్టుకుని హౌస్ ఫుల్ 5 మూవీ నిలబడడం విశేషం. శని, ఆదివారాలలో రూ. 30 కోట్లకు పైగా వసూలు అయ్యాయి. సాంప్రదాయ కామెడీ కీలకంగా ఉండడం దీనికి అదనపు బలంగా చేకూరింది. రూ. 100 కోట్ల మార్క్ ను దాటేసింది అవలీలగా. దేశ వ్యాప్తంగా చూస్తే సినిమా పరంగా రూ. 120 కోట్లను సాధించింది. సినీ వర్గాలను విస్మయ పరిచేలా చేసింది.
తనకు భారీ హిట్ లేక ఇబ్బంది పడుతున్న అక్షయ్ కుమార్ కు ఇది మంచి బూస్ట్ ఇచ్చిందని చెప్పక తప్పదు. మొత్తంగా హౌస్ ఫుల్ -5 హిట్ అని అంటున్నారు తన ఫ్యాన్స్. ఈ సినిమాకు పోటీగా ఇతర సినిమాలు లేక పోవడం కూడా ప్లస్ పాయింట్ అయ్యింది. థియేటర్లు అభిమానులతో నిండి పోతున్నాయి. మొత్తంగా అక్షయ్ కి గుడ్ లక్ కదూ.