క‌న్న‌డ భాష‌పై కామెంట్స్ వెన‌క్కి తీసుకోను

వివాదంపై క‌మ‌ల్ హాస‌న్ సాకింగ్ కామెంట్స్

ఇల‌య నాయ‌గ‌న్ క‌మ‌ల్ హాస‌న్ మ‌రోసారి నోరు విప్పారు. తాను క‌న్న‌డ భాష‌పై చేసిన కామెంట్స్ క‌రెక్టేనంటూ పేర్కొన్నారు. ఇందులో వెన‌క్కి త‌గ్గే ప్ర‌స‌క్తి లేద‌ని స్ప‌ష్టం చేశాడు. క‌న్న‌డ భాష త‌మిళంలో పుట్టింద‌ని, ఇందుకు ఆధారాలు త‌న వ‌ద్ద ఉన్నాయ‌ని అన్నారు. దీనిని కొంద‌రు కావాల‌నే రాజ‌కీయం చేస్తున్నారంటూ ఆరోపించారు. తాజాగా తాను న‌టించిన చిత్రం థ‌గ్ లైఫ్ పై స‌ర్వ‌త్రా ఆగ్ర‌హం వ్య‌క్తం కావ‌డం, క‌ర్ణాట‌క‌లో దానిని ఆడ‌కుండా నిషేధం విధిస్తామ‌నేంత దాకా వెళ్లింది.

దీనిపై తీవ్రంగా స్పందించాడు క‌మ‌ల్ హాస‌న్. ఇలాంటివి కేవ‌లం తమ ప్ర‌యోజ‌నాల‌ను కాపాడుకునేందుకు మాత్ర‌మే చేస్తారంటూ మండిప‌డ్డారు. తాను త‌ప్పు చేయ‌న‌ని, త‌ల వంచే ప్ర‌స‌క్తి లేద‌న్నారు. క‌ర్ణాట‌క సీఎం సిద్ద‌రామ‌య్య‌తో పాటు బీజేపీకి చెందిన ఎంపీలు సైతం క‌మ‌ల్ పై క‌న్నెర్ర చేశారు. త‌న‌కు పొగ‌రు ఎక్కువ‌గా ఉంద‌ని, ఇత‌రుల‌ను కించ ప‌రిచేలా మాట్లాడ‌టం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అంటూ ప్ర‌శ్నించారు.

ఇదిలా ఉండ‌గా క‌మ‌ల్ హాస‌న్ సినీ కెరీర్ లో విజ‌యాల కంటే వివాదాలే ఎక్కువ‌గా ఉన్నాయి. ఆయ‌న న‌టించిన సినిమాల‌లో హే రామ్, విశ్వ రూపంతో పాటు తాజాగా థ‌గ్ లైఫ్ చేరింది. దీనిని ప్ర‌ముఖ సినీ ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం తీశాడు. మంచి టాక్ వ‌చ్చింది. అయితే క‌మ‌ల్ హాస‌న్ తో 38 ఏళ్ల గ్యాప్ త‌ర్వాత మూవీ చేశాడు. మంచి స్పంద‌న వ‌చ్చింది. ఈ స‌మ‌యంలో క‌ర్ణాట‌క భాష‌పై చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర దుమారం రేపాయి. సినిమా ఆడుతుందా లేదా అన్న ఉత్కంఠ నెల‌కొంది.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com