Hero Sunny Deol-Jaat :జాట్ బిగ్ స‌క్సెస్ సీక్వెల్ అనౌన్స్

ప్ర‌క‌టించిన మూవీ మేక‌ర్స్

Jaat : ద‌మ్మున్నోడు గోపిచంద్ మ‌లినేని. టాలీవుడ్ లో త‌ను తీసిన‌వి కొన్ని సినిమాలే. కానీ అవి బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచాయి. త‌న టేకింగ్ డిఫ‌రెంట్ గా ఉంటుంది. క‌థ‌ను చెప్ప‌డంలో త‌న‌కు త‌నే సాటి. భావోద్వేగాల‌ను తెర మీద పండించ‌డంలో, ఆక‌ట్టుకునేలా చేయ‌డంలో త‌నదైన ముద్ర క‌న‌బ‌ర్చాడు. తాజాగా త‌ను బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. మ‌న‌సు పెట్టి తీశాడు. అంద‌రూ త‌నను త‌క్కువ‌గా అంచ‌నా వేశారు. అక్క‌డి సినిమా ప్రేక్ష‌కులు త‌ను తీసిన జాట్ ను చూసి విస్తు పోయారు. సన్నీ డియోల్, ర‌ణ దీప్ హూడా, రెజీనాలు కీల‌క పాత్రలు పోషించారు. దుమ్ము రేపింది ఈ మూవీ.

Jaat Movie Success Updates

ఇటీవ‌లే విడుద‌లైన జాట్(Jaat) మూవీ బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. త‌క్కువ రోజుల్లోనే ఏకంగా రూ. 70 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది. టాప్ నిర్మాత‌లైన మైత్రీ మూవీ మేక‌ర్స్ ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా నిర్మించారు. దీంతో మంచి టాక్ రావ‌డం, అత్య‌ధికంగా వ‌సూళ్లు చేయ‌డంలో మూవీ బృందం తెగ సంతోషానికి లోన‌వుతోంది. ఇదే స‌మ‌యంలో కీల‌క అప్ డేట్ వ‌చ్చింది నిర్మాత‌ల నుంచి . కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. జాట్ ను బిగ్ స‌క్సెస్ చేసినందుకు ధ‌న్య‌వాదాలు తెలిపారు. మాస్ మూవీగా పేరు పొందింది.

సన్నీ డియోల్ కు ఏజ్ పెరుగుతున్నా త‌న‌లో శ‌క్తి ఏ మాత్రం త‌గ్గ‌లేద‌ని నిరూపించాడు. త‌న‌ను తాను మ‌రోసారి న‌టుడిగా ప్రూవ్ చేసుకున్నాడు. ఇక డి మూవీతో సూప‌ర్ షో చేసిన ర‌ణ్ దీప్ హూడా కూడా ఇందులో కీ రోల్ పోషించాడు. ఇద్ద‌రూ పోటీ ప‌డి న‌టించారు. జాట్ ను సూప‌ర్ హిట్ అయ్యేలా చేసిన ద‌ర్శ‌కుడు గోపిచంద్ మ‌లినేనికి థ్యాంక్స్ చెబుతూనే సీక్వెల్ ఉంటుంద‌ని ప్ర‌క‌టించారు మైత్రీ మూవీ మేక‌ర్స్.

Also Read : Hero Naga Chaitanya : రూ. 100 కోట్ల బ‌డ్జెట్ తో నాగ చైత‌న్య మూవీ

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com