తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కొత్త ట్రెండ్ కొనసాగుతోంది. గతంలో బిగ్ సక్సెస్ అయిన మూవీస్ అయిన వాటిని తిరిగి రీ రిలీజ్ చేస్తున్నారు. సుదీర్ఘ కాలం తర్వాత దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించిన చిత్రం జగదేక వీరుడు అతిలోక సుందరి తిరిగి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లేటెస్ట్ టెక్నాలజీతో భారీ ఖర్చుతో విడుదల చేశారు. దీనిని అశ్వనీ దత్ నిర్మించాడు. ఆశించిన దానికంటే ఎక్కువ ఆదరణ లభిస్తోంది ఈ చిత్రానికి.
ఇందులో మెగాస్టార్ చిరంజీవి, దివంగత అందాల తార శ్రీదేవి ముఖ్య పాత్రలు పోషించారు. ఆనాడు టాలీవుడ్ లో చరిత్ర సృష్టించింది. మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా ఇచ్చిన సంగీతం, పాటలు సెన్సేషన్ క్రియేట్ చేశాయి. సినిమాను ఆదరించేలా చేసింది. ఈ మూవీ సరిగ్గా 1990లో విడుదలైంది. వైజయంతి మూవీస్ పతాకంపై ఇది విడుదలైంది.
జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా మే 9వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేశారు. అప్పట్లో రూ. 2 కోట్లతో రూపొందించిన సినిమా రూ. 15 కోట్లు కొల్లగొట్టింది. చిత్రానికి 2డీ వెర్షన్ ను రూపొందించారు. నైజాం, ఆంధ్రాలో మంచి స్పందన లభిస్తోంది. రూ. 2.75 కోట్లు వసూలు చేసింది. ఓవర్సీస్ లో రూ. 65 లక్షలు కొల్లగొట్టింది. 9న రూ. 1.5 కోట్లు, 2న రూ. 50 లక్షలు, 3న రూ. 50 లక్షలు , 4 న రూ. 30 లక్షలు, 5న రూ. 30 లక్షలు, 6న రూ. 25 లక్షలు వసూలు చేసి ప్రపంచ వ్యాప్తంగా రూ 3.35 కోట్లు వసూలు చేసింది.
