అందాల ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ సంచలనంగా మారారు. కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో తను నటించిన హోం బౌండ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అంతే కాదు ఈ చిత్రానికి పెద్ద ఎత్తున మద్దతు పలికారు సినీ రంగానికి చెందిన ప్రముఖులు. ఫీల్ గుడ్ ఉన్న మూవీ కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో మరో కీ రోల్ పోషించాడు ఇషాన్.
ఈ ఇద్దరు పోటీ పడి నటించారు. కమర్షియల్ సినిమాలలో ఫుల్ బిజీగా ఉన్న జాన్వీ కపూర్ ఆలోచనాత్మకంగా ఉండే మూవీని ఎంచుకోవడం, దానికి దర్శకుడు పదును పెట్టడం విస్తు పోయేలా చేసింది. నటనా పరంగా తనకు వంద మార్కులు పడ్డాయి. ఏ నటి అయినా లేదా నటుడు అయినా రాణించాలన్నా ముందు వారికి తగినట్టు మంచి పాత్రలు రావాల్సి ఉంటుంది. హోం బౌండ్ అలాంటిది కావడంతో జాన్వీ కపూర్ నమ్మకం పెట్టుకున్నారు.
ఇక ఇషాన్ కట్టర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తను గతంలో మసాన్ లో నటించాడు. ఇది విమర్శకుల నుంచి అద్భుతమైన ప్రశంసలు అందుకుంది. నీరజ్ ఘయ్వాన్ దర్శకత్వం వహించాడు. ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ చూరగొనడం అభినందనీయం. బోల్డ్, కళాత్మకతకు పెద్దపీట వేశాడు. గతంలో కూడా మసాన్ కు మంచి పేరొచ్చింది. అంతే కాదు అవార్డులు కూడా దక్కాయి. ఇషాన్ కట్టర్, జాన్వీ కపూర్ లు ఇద్దరూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ జీవితంలో మరిచి పోలేని చిత్రంగా ఇది మిగిలి పోతుందన్నారు.