Beauty Janhvi Kapoor :త‌మిళ్ వెబ్ సీరీస్ లో జాన్వీ క‌పూర్..?

ద‌ర్శ‌క‌త్వం వహించ‌నున్న పా రంజిత్

Beauty Janhvi Kapoor

Janhvi Kapoor : కోలీవుడ్ లో ద‌మ్మున్న డైరెక్ట‌ర్ గా గుర్తింపు పొందాడు పా రంజిత్. త‌ను తీసిన చిత్రాలు కొన్నే అయినా దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారేలా చేశాడు. త‌ను పూర్తి స్థాయిలో అంబేద్క‌రిస్ట్ గా త‌న‌ను తాను చెప్పుకున్నాడు. ఈ దేశంలో ఇంకా కుల వివ‌క్ష కొన‌సాగుతోంద‌ని ప్ర‌క‌టించాడు ధైర్యంగా. కాలా , క‌బాలీ మూవీస్ లో త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టించాడు. ఈ రెండూ సూప‌ర్ హిట్ గా నిలిచాయి. రీసెంట్ గా చియాన్ విక్ర‌మ్ తో తంగ‌లాన్ తీశాడు. ఇది ప్ర‌పంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకుంది. విమ‌ర్శ‌కుల నుంచి ప్ర‌శంస‌లు పొందింది.

Janhvi Kapoor in Tamil Web Series

తాజాగా పా రంజిత్(Pa Ranjith) గురించి కీల‌క అప్ డేట్ వ‌చ్చింది. ఓ స్టార్ ఓటీటీ సంస్థ కోసం త‌మిళంలో వెబ్ సీరీస్ కోసం ప్లాన్ చేశాడ‌ని, ఇందుకు చ‌ర్చ‌లు కూడా పూర్త‌యిన‌ట్లు స‌మాచారం. స‌ద‌రు సంస్థ ఎన్ని కోట్లు అయినా ఖ‌ర్చు చేసేందుకు వెనుకాడే ప్ర‌స‌క్తి లేద‌ని స్ప‌ష్టం చేయ‌డంతో మ‌నోడు రంగంలోకి దిగిన‌ట్టు టాక్. ఇందులో భాగంగా త‌ను తీయ‌బోయే వెబ్ సీరీస్ కోసం ప్ర‌ధానంగా ఫిమేల్ రోల్ ముఖ్య‌మ‌ని, దాని కోసం ఇప్ప‌టికే ప‌లువురు హీరోయిన్ల‌ను సంప్ర‌దించాడ‌ని, కానీ ఏ ఒక్క‌రు త‌ను కోరుకున్న పాత్ర‌కు స‌రి పోవ‌డం లేద‌ని స‌మాచారం.

అయితే బాలీవుడ్ లో ప్ర‌స్తుతం బిజీగా ఉన్న జాన్వీ క‌పూర్(Janhvi Kapoor) అయితే బాగుంటుంద‌ని త‌న‌ను సంప్ర‌దించిన‌ట్టు విస్తృతంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. గాంభీర్యం, స్క్రీన్ ప్ర‌జెంటేష‌న్ కు పేరు పొందింది. త‌ను జూనియ‌ర్ ఎన్టీఆర్ తో దేవ‌ర‌లో న‌టించింది. ప్ర‌స్తుతం బుచ్చిబాబు స‌న‌తో క‌లిసి రామ్ చ‌ర‌ణ్ తో తెర పంచుకుంటోంది. త‌న తొలి చిత్రం ధ‌డ‌క్ తో పేరు పొందింది. ఇంకా బ్లాక్ బ‌స్ట‌ర్ హిందీలో రాలేదు. కానీ తెలుగులో వ‌చ్చిన దేవ‌ర మాత్రం సూప‌ర్ హిట్ టాక్ తెచ్చుకుంది. సామాజిక స్పృహతో కూడుకున్న వెబ్ సీరీస్ లో త‌ను న‌టించేందుకు ఓకే కూడా చెప్పిన‌ట్లు తెలిసింది. ఇంకా క‌న్ ఫ‌ర్మ్ చేయ‌లేదు పా రంజిత్.

Also Read : Hero Rajinikanth-Jailer 2 :త‌లైవాతో త‌ల‌ప‌డ‌నున్న ఫ‌హాద్ ఫాసిల్ 

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com