Jani Master : జానీ మాస్టర్ ను చంచల్ గూడ జైలుకు తరలిస్తూ 3వ తేదీ వరకు కస్టడీ పొడిగింపు

పోలీసు విచారణలో జానీ మాస్టర్ ఏం చెప్పారన్నది ఆసక్తికరంగా మారింది...

Hello Telugu - Jani Master

Jani Master : కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. తన వద్ద పనిచేసిన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌పై అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొటున్న జానీ మాస్టర్‌(Jani Master) నాలుగు రోజుల పోలీసు కస్టడీ ముగియడంతో ఆయనను నార్సింగ్ పోలీసులు రంగారెడ్డి జిల్లా కోర్టులో హాజరుపరిచారు. దీంతో వచ్చే నెల 3వ తేదీవరకు జానీ మాస్టర్‌కు జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. న్యాయస్థానం రిమాండ్ విధించడంతో జానీ మాస్టర్‌ను చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈనెల 25వ తేదీన జానీ మాస్టర్‌ను కోర్టు నాలుగు రోజుల పోలీసు కస్టడీకి అనుమతించింది. శనివారంతో కోర్టు విధించిన గడువు ముగియడంతో ఆయనను జడ్జి ముందు హాజరుపరిచారు.

పోలీసులు మరోసారి కస్టడీ కోరకపోవడంతో ఆయకు జ్యూడిషియల్ రిమాండ్‌ను కొనసాగిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 3వ తేదీన ఆయనను మరోసారి కోర్టులో హాజరు పరుస్తారు. పోలీసు కస్టడీలో జానీ మాస్టర్‌ను పలు ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. ఆరోపణలు చేసిన యువతిలో ఎలాంటి సబంధం కలిగి ఉన్నారు. ఆమెతో ఎలా పరిచయం ఏర్పడిందనే దానిపై వివిధ కోణాల్లో విచారించినట్లు తెలుస్తోంది. బాధితురాలి నుంచి పోలీసులు సేకరించిన ఆధారాలను జానీ ముందు పెట్టి విచారించారు. మరోవైపు జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్‌పై సోమవారం విచారణ జరగనుంది.

Jani Master Case Updates

పోలీసు విచారణలో జానీ మాస్టర్(Jani Master) ఏం చెప్పారన్నది ఆసక్తికరంగా మారింది. జానీ మాస్టర్ రిమాండ్‌ రిపోర్టులో పోలీసులు విస్తుపోయే విషయాలను వెల్లడించిన విషయం తెలిసిందే. దురుద్దేశంతోనే బాధితురాలిని అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌గా తీసుకున్నట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఆమెకు ఒక ప్రముఖ డ్యాన్స్‌ షోలో పాల్గొనే అవకాశం రావడంతో 2017లో నగరానికి వచ్చిందని.. తర్వాత జానీ మాస్టర్‌ వద్ద అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌గా చేరిందని పేర్కొన్నారు. 2019 డిసెంబరు 15 నుంచి జానీ మాస్టర్‌ వద్దే పనిచేస్తూ అల్కాపురి కాలనీలో ఉంటోందని, ఆ సమయంలో ఇద్దరూ ఒక సూపర్‌హిట్‌ సినిమాకు పనిచేశారని ప్రస్తావించారు. ఆ సినిమా పని నిమిత్తం 2020 జనవరి 10న జానీ మాస్టర్‌, బాధితురాలు, మరో ఇద్దరు సహాయకులు ముంబైకి వెళ్లారన్నారు. ఆ రోజు రాత్రి 12 గంటలకు బాధితురాలిని ఆధార్‌ కార్డు, ఇతర డాక్యుమెంట్లు తీసుకొని తన గదికి రావాలని ఆదేశించారని, ఆమె గదిలోకి రాగానే గడియపెట్టి అత్యాచారం చేశాడని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న విషయం తెలిసిందే. అప్పటికీ బాలిక వయసు 16 సంవత్సరాలని రిమాండ్‌ రిపోర్టులో తెలిపారు.

Also Read : IIFA 2024 : వైభవంగా ‘ఐఫా 2024’ వేడుకలు..అవార్డు విజేతలు వీరే

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com