Jawan Advance Booking : అట్లీ కుమార్ దర్శకత్వం వహించిన జవాన్ విడుదలయ్యేందుకు సిద్దమైంది. బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ , అందాల తార నయనతార , లవ్లీ బ్యూటీ దీపికా పదుకొనే, విలక్షణ నటుడు విజయ్ సేతుపతి కలిసి నటించారు. ఇప్పటికే టేకింగ్ లో, మేకింగ్ లో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ స్వంతం చేసుకున్న డైరెక్టర్ మరోసారి తన సత్తా చూపేందుకు రెడీ అయ్యాడు.
Jawan Advance Booking Viral
ప్రత్యేకించి షారుక్ ఖాన్ ద్విపాత్రాభినయం చేయడం విశేషం. యాక్షన్, డ్రామా, రొమాంటిక్ సన్నివేశాలు ఆశించిన దాని కంటే ఎక్కువే ఉన్నాయి. ఇప్పటికే జవాన్(Jawan) కు సంబంధించి విడుదల చేసిన పోస్టర్స్ , టీజర్ , సాంగ్స్ కెవ్వు కేక అనిపించడంతో భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యేందుకు సిద్దమైంది.
ఇటు భారత్ లో అటు ఓవర్సీస్ లో బాద్ షా షారుక్ ఖాన్ కు లెక్కలేనంత మంది ఫ్యాన్స్ ఉన్నారు. వారి అభిరుచి మేరకు సినిమాను తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యాడు అట్లీ కుమార్. ఇప్పటికే 5 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడు పోవడం షారుక్ ఖాన్ కు ఉన్న క్రేజ్ ఏపాటిదో చెప్పకనే చెబుతోంది.
ఎక్కడా రాజీ పడకుండా జవాన్ ను తీశాడు అట్లీ. ఇక భారత్ వరకు చూస్తే 3,91,000 టికెట్లు అమ్ముడు పోయాయి. ఇది ఓ రికార్డ్ అని చెప్పక తప్పదు. ఇప్పటి వరకు ఏ భారతీయ సినిమా ముందస్తు టికెట్లు సేల్ కాలేదు.
Also Read : Jailer Record : తమిళ నాట తలైవా పాట